మావారు దగ్గరకు రాగానే బిగుసుకుపోతున్నాను. ఆయనకు విసుగొచ్చి నాకు దూరమై పోతారని భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి.
నా వయసు 21. మూడు నెలల క్రితమే పెళ్లయ్యింది. మావారు చాలా మంచివారు. కానీ మేం ఇప్పటి వరకూ ఒక్కటి కాలేదు. దానికి కారణం నేనే. సెక్స్ చేసినప్పుడు విపరీత మైన నొప్పి వస్తుందని, రక్తం కూడా వస్తుందని నా ఫ్రెండ్స్ చెప్పారు. దాంతో నాకు చాలా భయమేస్తోంది. మావారు దగ్గరకు రాగానే బిగుసుకుపోతున్నాను. ఆయన ధైర్యం చెబుతున్నా నావల్ల కావడం లేదు. ఆయనకు విసుగొచ్చి నాకు దూరమై పోతారని భయంగా ఉంది. పరిష్కారం చెప్పండి.
ఫ్రెండ్స్ ఎవరో ఏదో చెప్పారని ముందుగానే భయపడిపోయి, ముందుకు వెళ్లను అంటే ఎలా! సెక్స్ చేసేటప్పుడు మొదట్లో కాస్త నొప్పి ఉండవచ్చు. కానీ అది అందరికీ ఉండాలని లేదు. అలాగే రక్తం రావాలని కూడా లేదు. మీ భయాన్ని పక్కన పెట్టి, మెల్లగా ఇద్దరూ ఒకరికొకరు సహాయపడుతూ, అర్థం చేసుకుంటూ, ఫోర్‌ప్లే ద్వారా ఒకరినొకరు ప్రేరేపించు కుంటూ కలిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదు. భయంతో బిగుసుకుపోవడం వల్ల కలయిక జరగదు. ఒకవేళ బలవంతంగా ప్రయత్నించినా నొప్పి విపరీతంగా ఉండి, బ్లీడింగ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
మీవారు చక్కగా ధైర్యం చెబుతున్న ప్పుడు మీరు భయపడా ల్సిన అవసరం ఏముంది! కావాలంటే మొదట్లో లూబ్రి కేటింగ్ జెల్స్, కేవై జెల్లీ, లూబిక్ జెల్ వంటివి వాడితే నొప్పి తెలియకుండా ఉంటుంది. అంతేకానీ మీరు ఇలా భయ పడుతూనే ఉంటే మీవారికి నిజంగానే విసుగొచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త! ( డా. వేనాటి శోభ )