ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
నాకు 28 ఏళ్లు. పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. నేను ప్రతిరోజూ సెక్స్ చేస్తున్నాను. అయితే అంగస్తంభన బాగానే ఉన్నా వీర్యస్ఖలనం మాత్రం త్వరగా అయిపోతోంది. ఒకసారి వీర్యస్ఖలనం అయ్యక మళ్లీ అంగస్తంభన కలగడం లేదు. దాంతో నా భార్య సెక్స్‌లో సంతృప్తి చెందలేకపోతోంది. ఇద్దరమూ నిరాశ చెందుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
మీరు చెప్పిన కండిషన్‌ను ప్రీ-మెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటారు. ఇది పురుషుల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. వీర్యస్ఖలనం అన్నది ఒక రిఫ్లెక్స్ యాక్టివిటీ. సెక్స్ ప్రక్రియలో అంగం మీద ఉన్న చర్మం ఉత్తేజితం కావడం వల్ల ఈ వీర్యస్ఖలనం అన్న రిఫ్లెక్స్ ప్రక్రియ జరుగుతుంది. కొంతమందిలో ఈ స్పందనలు (స్టిమ్యులేషన్స్) త్వరగా కలగడం వల్ల వీర్యస్ఖలనం వెంటనే జరిగిపోతోంది. ఇలాంటి వాళ్లు సెక్స్‌లో నేరుగా పాల్గొనకుండా తగినంత ప్రీ ప్లే చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. దాంతోపాటు వీర్యస్ఖలనం ఫీలింగ్ రాగానే వెంటనే అంగాన్ని బయటకు తీసి పురుషాంగం చివర (శిశ్నం వెనక భాగంలో) గట్టిగా నొక్కి పట్టుకోవాలి. స్ఖలనం ఫీలింగ్ తగ్గగానే మళ్లీ సెక్స్ చేయడం ప్రారంభించాలి. ఇలా నొక్కి పట్టుకుని స్ఖలనాన్ని నియంత్రించే ప్రక్రియను ‘పించ్ అండ్ స్టార్’ టెక్నిక్ అంటారు. ఈ పించ్ అండ్ స్టార్ట్ టెక్నిక్‌తోనూ మీ సమస్య తగ్గకపోతే ఆండ్రాలజిస్ట్‌ను కలవండి. మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. కౌన్సెలింగ్‌తో, మందులతో మీ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. ( డాక్టర్ వి. చంద్రమోహన్ )