శృంగారానుభవానికి అంగం సైజు ముఖ్యమా?
లైంగిక తృప్తికి పురుషాంగం పరిమాణమే ముఖ్యమన్నది పెద్ద అపోహ. అయితే అసలు సైజుకు ఏ మాత్రం ప్రాముఖ్యం లేదనుకోవటానికి కూడా లేదు. సగటు పరిమాణం ఉండటం అవసరం. ముఖ్యంగా పొడవు ఒక్కటే కాదు.. తగినంత లావు ఉండటం కూడా ముఖ్యమే. అంగ ప్రవేశం తర్వాత కూడా స్త్రీకి అది జరిగినట్లు తెలియకపోతుంటే కచ్చితంగా సమస్య ఉందనే అర్థం. మరోవైపు స్త్రీల యోని కూడా కొందరిలో చాలా సాగినట్లు ఉండొచ్చు, కొందరిలో కాన్పు సమయంలో చినిగినట్లవ్వచ్చు, లేదూ వైద్యులు కాన్పు కోసం కోత బెట్టటం (ఎపిసియాటమీ) సరిగా చెయ్యకపోవచ్చు, కారణమేదైనా అంగం తగినంత పరిమాణం ఉండటం ముఖ్యమే.
దేశదేశాల్లో సగటున పురుషాంగం సైజు ఎంత ఉంటోందన్న దానిపై చాలా అధ్యయనాలు చేశారు. ఇవి మన దేశంలోనూ జరిగాయి. సగటున పురుషాంగం పొడవు 4 అంగుళాలున్నా చాలు. సైజు కన్నా కూడా భాగస్వామిని తృప్తిపరచటం ఎలాగన్నది, ఎక్కడెక్కడ ప్రేరణలు ఇస్తే ఆమె ఉత్తేజితమవుతుందన్నది తెలియాలి.
అలాగే చాలామంది పురుషాంగం పొడవుగా ఉండాలనుకుంటుంటారుగానీ వాస్తవానికి పొడవు కంటే తగినంత లావు ఉండటం స్త్రీ తృప్తికి చాలా ముఖ్యం. స్త్రీకి తృప్తినిచ్చే కేంద్రాలన్నీ కూడా చాలావరకూ యోని పైభాగానే, ముఖద్వారం చుట్టూరానే ఉంటాయి. లోపలి భాగమంతా కేవలం ఓ గొట్టం వంటిదే. అక్కడ పెద్దగా స్పందనలేవీ తెలియవు కూడా. పైగా కాన్పు సమయంలో బిడ్డ పట్టేటంతగా సాగాలి కాబట్టి ప్రకృతి సహజంగానే ఈ లోపలి గొట్టపు భాగం నొప్పి వంటి భావనలు పెద్దగా తెలియకుండా నిర్మితమై ఉంటుంది. సంభోగ సమయంలో పురుషుడు స్ఖలించే వీర్యాన్ని పైకి పంపించటం తప్పించి..
ఈ గొట్టంలాంటి యోని ఆకృతికి పెద్దగా ప్రయోజనమేదీ లేదు. తృప్తి కేంద్రాలన్నీ కూడా యోని ఉపరితల భాగాల్లోనే ఉంటాయి కాబట్టి పురుషాంగం సైజు ఎంత ఉన్నా తృప్తికి అది ముఖ్యం కాదు. నీలిచిత్రాలు చూసి సైజుల విషయంలో ఏవేవో వూహించుకునేవారు మాత్రం నిరుత్సాహానికి గురవటం తథ్యం.