నా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ చేశాను. నా భర్తకు ద్రోహం చేస్తున్నందుకు బాధ కలుగుతోంది. నేనేం చేయాలి?
నాకు మూడు నెలల క్రితం పెళ్లయ్యింది. నా భర్త, నేను శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నాం. అయితే నేను పెళ్లికి ముందు చాలాసార్లు నా బాయ్‌ఫ్రెండ్‌తో సెక్స్ చేశాను. కానీ ఎప్పుడూ యోనిలో స్ఖలనం కానివ్వలేదు. ఒక్కసారి మాత్రం యోని దగ్గర చర్మం చిట్లి రక్తం వచ్చింది. అది గుర్తొచ్చినప్పుడల్లా ఆ అబ్బాయికి ఎయిడ్స్ ఉంటే, నాకూ వచ్చి వుంటుందన్న అనుమానం పీడిస్తోంది. నా భర్తకు ద్రోహం చేస్తున్నందుకు బాధ కలుగుతోంది. నేనేం చేయాలి?
తెలిసి తప్పు చేసి ఇప్పుడు బాధపడితే ఏం లాభం! బాధపడి చేసేది కూడా ఏం లేదు కదా! ఎయిడ్స్ గురించి అనుమానం ఉంటే, ఓసారి రక్తంలో హెచ్‌ఐవీ ఉందేమో పరీక్ష చేయించుకోండి. ఏమీ లేదని తెలిస్తే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఒకవేళ ఉందని తెలిస్తే, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే మీవారికి కూడా పరీక్ష చెయ్యించాలి. ఆలోచన లేకుండా చేసే పనుల వల్ల జీవితాంతం బాధ వెంటాడు తూనే ఉంటుంది. మీరు పశ్చాత్తాపం చెందడం మంచిదే.
కానీ ఇలా కుమిలి పోవడం వల్ల ఉపయోగం లేదు. వీలైతే, మీవారు అర్థం చేసుకుంటారన్న నమ్మకం ఉంటే… ఓసారి మనసు విప్పి ఆయనతో మాట్లాడండి. జరిగినదంతా చెప్పి మన్నించమని అడగండి. ఇబ్బందులు వస్తాయి అనుకుంటే జరిగింది మర్చిపోయి ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిం చండి. నిర్ణయం మీదే. ఈ విషయంలో ఎవరం ఏమీ చెప్పలేం, చెయ్యలేం. ( డా. వేనాటి శోభ )