Header Ads

ఇద్దరమ్మాయిలు సెక్స్ చేస్తోన్న వీడియో చూపించి, నన్నూ తనతో అలా ఉండమంటోంది. అలా చేయడంలో తప్పేం లేదంటోంది. తను చెప్పింది నిజమేనా?

Best Sex Positions and Tips of - 26 Sex Moves and How To Pull Them Off
నా వయసు 23. పెళ్లి కాలేదు. హాస్టల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాను. నా రూమ్మేట్ వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. మీద చేతులు వేయడం, పట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటుంది. మొదట్లో సరదాకేమో అనుకున్నాను. కానీ ఇద్దరమ్మాయిలు సెక్స్ చేస్తోన్న వీడియో చూపించి, నన్నూ తనతో అలా ఉండమంటోంది. అలా చేయడంలో తప్పేం లేదంటోంది. తను చెప్పింది నిజమేనా? ఇద్దరు ఆడపిల్లలు అలా ఉండొచ్చా? దానివల్ల సమస్యలేమీ రావా?
మారుతున్న కాలం మహిమో, సినిమాల ప్రభావమో కానీ.. యవ్వనంలో ఉన్నవారి ఆలోచనలు రకరకాలుగా ఉంటున్నాయి. దానికి తోడు ఇంటర్నెట్, యూట్యూబ్ వంటి వాటిలో అన్ని రకాల వీడియోలు తేలికగా కళ్లముందు కనబడు తుంటే… వాటివల్ల ఉత్తేజితం అయ్యి, ప్రేరేపణకు గురవుతున్నారు. అలా వీడియోల్లో కనిపించడం తప్పు కాదనే భావనలో పడుతున్నారు. అలాగే పక్క వారిని కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. ఇద్దరు ఆడపిల్లలు అలా ఉండొచ్చా అంటే జవాబు చెప్పడం కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
మన సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. వాటి ప్రకారమే మనం నడుచు కుంటున్నాం. ఇతర పనులు లేకుండా సెక్స్ పైన ఆసక్తి పెరిగి, కోరికలను అణచు కోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు కొందరు ఆ కట్టుబాట్లు తప్పి ప్రవర్తించడం జరుగు తుంది. ఎవరి ఆసక్తి వారిది. దానివల్ల ప్రత్యేకంగా శారీరక సమస్యలు ఏమీ రావు. కాకపోతే మానసికంగా డిస్టర్బ్ అయ్యి, చేసే పనిలో నిమగ్నం కాలేక పోవచ్చు. అలాగే ఆడపిల్లల మీద ఆసక్తి పెరిగి, పెళ్లయ్యాక భర్తకు దగ్గర కాలేక ఇబ్బంది పడినవాళ్లూ ఉన్నారు. కాబట్టి ఆలోచించి అడుగేయాలి.( డా. వేనాటి శోభ )

Post Top Ad

Post Bottom Ad