టైట్ జీన్స్‌తో బోలెడు సమస్యలు..! ఎందుకు? ఏమిటి?
జీన్స్ వాడితే.. అనారోగ్యాలకు గురవుతారా..? జీన్స్ వల్ల చర్మ వ్యాధులు వస్తాయా.. అంటే అవుననే చెబుతున్నారు నిపుణులు. అసలు జీన్స్ మన వాతావరణానికి సరిపోతాయా.. జీన్స్ అనగానే.. ‘నీ జీనూ ప్యాంటూ చూసి బుల్లమ్మో.. నీ సైకిల్ చైనా చూసి పిల్లోడా..!’ అంటూ.. ‘యమలీల’ సినిమాలో ఆలీ పాడిన పాట గుర్తొస్తుంది. మారుతున్న కాలానుగుణంగా.. అన్నిటిల్లోనూ మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా వస్త్రాధారణలో.. శరవేగంగా మర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు.. మగవారు మాత్రమే ఈ జీన్స్‌లను ధరించేవారు. కానీ.. ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా.. అందరూ ఈ జీన్స్‌ని వాడుతున్నారు. అందులోనూ.. ఈ జీన్స్ సౌకర్యవంతంగా ఉండటంతో.. దీని వాడకానికి అసలు అద్దూహడుపు లేదనుకోండి.
ఒక్క జీన్స్‌నే కాదు.. టైట్ ఫిటింగ్స్, లెగ్గిన్స్ వంటి వాటిని.. ముఖ్యంగా యువత బాగా వాడుతున్నారు. ఈ జీన్స్‌ల వాడకం వల్ల.. పలు రకాలైనటువంటి చర్మ వ్యాధులు వస్తున్నాయని నిపుణులు తెలుపారు. అతిగా వాడితే కనుక ఖచ్చితంగా స్కిన్ ఎలర్జీస్ రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. తామర, శోబి వంటి వ్యాధులు యువతలో ఎక్కువగా వస్తున్నాయని చర్మ వ్యాధుల నిపుణులు తెలుపుతున్నారు. జీన్స్, సిల్క్, సింథటిక్ బట్టలు వాడే ప్రతి వంద మందిలో.. పది మంది చర్మ వ్యాధులతో తమ వద్దకు వస్తున్నారని వారు చెబుతున్నారు.
జీన్స్.. చెమట పీల్చుకోకపోవడం.. గాలి చొరబడనివ్వకపోవడం వంటి కారణాల వల్ల ఫంగస్ ఏర్పడి.. స్కిన్ ఎలర్జీస్ వస్తున్నాయట. అలాగే.. టైట్ ఫిట్టింగ్స్ వాడటం వల్ల రక్త ప్రసరణ సరిగా అవ్వదు. దీంతో ఆ ప్రదేశాల్లో కొవ్వు ఏర్పడి లావు కూడా అవుతారని నిపుణులు పేర్కొన్నారు.