కోసిన ‘ఉల్లి’ ముక్కలు తింటే.. ఇంత డేంజరా!
సాధారణంగా.. మనం పానీపూరీ బండి దగ్గర లేదా బిర్యానీ తినడానికి వెళ్తే.. ఉల్లిపాయలను కట్ చేసి పెడతారు. అలా తినడం చాలా హానికారమన్న విషయం మీకు తెలుసా..? మామూలుగా.. ఉల్లిపాయను కట్ చేసే ఉపయోగిస్తారు. కానీ.. కట్ చేసిన కొన్ని గంటల తర్వాత తింటే అది విషంతో సమానమట. అవును ఇది నిజమే. మరి అదెలాగో తెలుసుకోండి.
‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే’ సామెతలాగే.. దాని వల్ల చాలా ఉపయోగాలున్నాయి. దీర్ఘకాలిక రోగాలను సైతం ఉల్లి తగ్గిస్తుంది. అయితే.. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒకసారి తరిగిన ఉల్లిపాయలను మరొకసారి తిరిగి ఉపయోగించకూడదని.
కాగా… వీటిపై పరిశోధన చేసిన పరిశోధికులు కూడా ఇదే విషయాన్నివెల్లడించారు. ఎప్పుడైనా ఉల్లిపాయలను.. కోసిన వెంటనే ఉపయోగించాలట. ఉల్లి ముక్కలను కోసిన కొన్ని గంటల తర్వాత వాటిని తింటే విషయంతో సమానమని వారు తెలియజేశారు. అలాగే.. రేపటికి ఉపయోగపడతాయి కదా అని.. కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం కూడా మంచి పద్దతి కాదట.
ఎందుకంటే.. ఉల్లిలో ఘాటు ఎక్కువ గనుక.. అది ఈజీగా గాలిలో ఉండే బ్యాక్టీరియాలను ఆకర్షిస్తుంది. దీంతో.. వాటిని గనుక మనం తీసుకుంటే.. కడపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి.. ఇక మీరు కూడా ఈ చిన్న టిప్‌ని ఫాలో అయి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.