Header Ads

గంటల తరబడి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారా.? అయితే ప్రమాదమే!

Ear Phones Using For Hours Is Danger, గంటల తరబడి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తారా.? అయితే ప్రమాదమే!

ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా యువత చెవిలో ఇయర్ ఫోన్స్‌తో దర్శనం ఇస్తున్నారు. అయితే ఇయర్ ఫోన్స్ 4 నిమిషాలకు మించి వాడితే ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. అలా వాడితే వినికిడి సమస్యను ఎదుర్కొనక తప్పదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ హెచ్చరించింది. ఆపకుండా అదే పనిగా ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సంగీతం వినేవారికి చెవుడు వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు. పెద్ద శబ్దాల వల్ల కలిగే వినికిడి సమస్యకు చికిత్స లేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చెవిలో కణాలు సున్నితంగా ఉండడం వల్ల అవి పెద్ద శబ్దాలు తట్టుకోలేవు అని అన్నారు. దీనిని నిరోధించాలంటే వినికిడి పరికరాలు ఎంత తక్కువ వాడితే అంత మంచిదని వారి సూచన. భారత్‌లో వయసు పెరగడం వల్ల సమస్యలు వచ్చి బాధపడేవారి కంటే వినికిడి సమస్యతో బాధపడేవారే ఎక్కువని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ వైద్యులు వెల్లడించారు.

Post Top Ad

Post Bottom Ad