వివాహమైన మొదటి సంవత్సరం ఎందుకు ముఖ్యమైనది
వివాహమైన మొదటి సంవత్సరం ఎందుకు ముఖ్యమైనది.
- కొత్తగా పెళ్లైన వారే ఎక్కువగా విడాకులు తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
- వివాహమైన మొదటి సంవత్సరం చిరకాల సంబంధం యొక్క పునాది ఏర్పరుస్తుంది.
- సర్దుబాట్లు &మార్పులు విజయవంతమైన వివాహానికి మార్గాలుగా చెప్పవచ్చు.
- వివాహం చేసుకునేపుడు మీ యొక్క ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
ఇంతకూ ముందు ఎన్నడూ లేనివిధంగా ఇటీవలి కాలంలో అనేక వివాహ సంబంధాలు విచ్చిన్నమవుతున్నాయి. వ్యక్తులకు ఈ విషయం చాలా సాధారణంగా మారిపోయింది అందువలననే ఈ విడాకుల మారణహోమం ఒక ముప్పుగా పరిణమిస్తుంది. దీనికి గల ప్రధాన కారణం ఒకరకమైన భ్రమని కలిగి ఉండడమే. చాలా మంది ఎక్కువలో ఎక్కువగా వారు ఏమి కావాలనుకుంటున్నారో మరియు ఏది వద్దు అనుకుంటున్నరో అనే విషయంపై స్పష్టతను కలిగి ఉంటున్నారు కావున దీని కారణంగా వారు ఈ అసఫలమైన సంబంధం నుండి బయటపడాలనుకుంటున్నారు. ఈ నేపధ్యంలో వివాహం జరిగిన మొదటి సంవత్సరం ప్రధాన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మరియు దంపతులు నిర్మాణాత్మక సంవత్సరాలలో వారి వివాహం సక్రమంగా కొనసాగించుటకు ఒక బలమైన పునాది నిర్మించుటలో శ్రద్ధను వహించి ఉండాలి.
ఎవరినైన ఒకరిని డేట్ చేయడం ఒక విషయం మరియు అతనినే లేదా ఆమెనే వివాహం చేసుకోవడం మరొక విషయం. వివాహం ద్వారా ముఖ్యంగా మీకు మీ భాగస్వామి పట్ల గల అమితమైన ఇష్టాన్ని ఒక స్పష్టమైన రూపంలో చూపించవచ్చు. నిజానికి కొత్తగా పెళ్లైన జంట వివాహమైన మొదటి సంవత్సరంలో వారి సంబంధాన్ని అందంగా నిర్మించుకోవచ్చు లేదా విచ్ఛిన్నం చేసుకోవచ్చు మరియు బహుశా దీని కారణంగానే విడాకుల నుంచి వివాహ బంధం తెగిపోకుండా కాపాడబడుతుంది. ఇక్కడ వివాహమైన మొదటి సంవత్సరం ఎందుకు ముఖ్యమో దానికి సంబంధించిన కొన్ని కారణాలను మరియు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడానికి కారణాలను తెలియచేయడం జరిగింది.
ఒకరి గురించి మరోకరు తెలుసుకునే సంవత్సరం
వివాహమైన మొదటి సంవత్సరం అంటేనే ఒకరి గురించి మరోకరు తెలుసుకునే ఒక సంవత్సరం. వారి మొదటి సంవత్సరంలో కొత్తగా పెళ్లైన జంట సాధారణంగా వారి భాగస్వామి యొక్క జీవనశైలి గురించి తెలుసుకున్నపుడు వారిది వీరిది సరిపోలకపోవచ్చు అయితే ఒకరితో ఒకరు అలవాటుపడుటకు కొంత సమయం, సహనము అవసరం. సాధారణంగా వివాహమైన మొదటి సంవత్సరంలో ఒక జంట వారి రోజువారీ ప్రణాళిక ప్రకారం, వారి జీవితంలో అనేక సర్దుబాట్లను చేసుకోవడం గమనిస్తూనే ఉంటాం అయితే ఇవి జీవితంలో ఒక శాశ్వత ముద్రగా మిగిలిపోతాయి. అందువలననే వివాహమైన మొదటి సంవత్సరంలో ఒకరినొకరు అర్ధం చేసుకోవడం చాలా ముఖ్యం.
భవిష్యత్తు ప్రణాళిక
ఒక పదిలమైన వివాహ రక్షణ అనేది మీ భవిష్యత్ ప్రణాళికల పై ఆధారపడి ఉంటుంది. ఒక జంట వారి భవిష్యత్తు అవసరాలను మరియు కోరికలను అర్థం చేసుకున్నప్పుడు వారి వివాహ జీవితం ఒకే పేజీలో ఉన్నట్టు చెప్పవచ్చు. దంపతులిద్దరూ కలిసి వారి భవిష్యత్తు ప్రణాళికను వేసుకోవడం మరియు దానికే కట్టుబడి ఉండడం అనేది వివాహా మొదటి సంవత్సరంలో ఎంతో కీలకం. భవిష్యత్తులో ప్రణాళిక వేసుకున్నప్పుడు, లక్ష్యాలను సాధించడానికి మరియు సంవత్సరాలు గడిచినా కొలది వారు మరింత ప్రేమలో మునిగిపోవడానికి ఇద్దరుకలిసి కృషి చేయవచ్చు.
వ్యక్తి యొక్క స్వభావం
వివాహమైన మొదటి సంవత్సరంలో అర్థం చేసుకోవలసిన మరొక అతి ముఖ్యమైన విషయం "భాగస్వామి స్వభావం". ఈ విషయం ఎప్పటికైనను కీలకమైనదే, మరియు చాలా మంది ఈ విషయం ఆధారంగానే వారి జీవితంను నిర్ణయించుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క స్వభావం ప్రీతిపాత్రంగా ఉన్నట్లయితే, మీ వివాహ శీర్షిక పూర్తిస్థాయిలో సురక్షితమని చెప్పవచ్చు. ఒక మంచి స్వభావం గల వ్యక్తి ఎల్లప్పుడూ మీరు ఒక వివాహం నుండి ఏమి కోరుకుంటున్నారో అది అందిస్తారు, మీకు వారు ఒక మార్గదర్శిగా మరియు ఒక ఉత్తమ స్నేహితుడిగా మెదులుతారు.
ప్రాధాన్యతలను పరిశీలించుకోవడం
ఒక కొత్త జంటకు భవిష్యత్తులో ఏం జరుగబోతుంది వంటి అనేక విషయాలను నిర్ణయించుటకు ఇవి నిర్మాణాత్మక సంవత్సరాలు కనుక, మీరు అతని లేదా ఆమె యొక్క ప్రాధాన్యతలను తప్పక గ్రహించాలి. ఒక వ్యక్తి మీ గురించి ఎక్కువగా పట్టించుకొని అతని లేదా ఆమె జీవితం పై ఆకాంక్షలను ముందుగానే విధించినట్లయితే, జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో అది మంచి వార్త కాదు. ఈ విషయంను వివాహమైన మొదటి సంవత్సర సమయంలో మీ పట్ల అతను లేదా ఆమె ప్రతిస్పందించే తీరు ఆధారంగా గమనించవచ్చు. కావలసినంత ప్రేమ మరియు శ్రద్ధ చూపిస్తున్నారా?, లేదా అతను లేదా ఆమె వివాహంను కేవలం భరించవల్సిన ఒక భారంగా భావిస్తున్నారా? అనేవి తెలుసుకోవాలి.