Header Ads

అలర్ట్ : శరీరంలో కొవ్వు చేరితే వచ్చే ప్రాణాంతక వ్యాధులు..!!

అకస్మాత్త్ గా మీరు బరువు పెరిగారా? శరీరంలో కొవ్వు చేరిందా..? ఉన్న బరువుకు శరీరంలో ఫ్యాట్ చేరితే చూడటానికి చాలా అసహ్యంగా ఉంటుంది. ముఖ్యంగా పొట్ట ఉదరంలో నడుము చుట్టూ కొవ్వు చేరితే చూడటానికి అసహ్యంగా ఉంటుంది. ఎంత మంచి డ్రెస్సులు వేసుకున్నాలావు కనబడనివ్వకుండా దాచలేరు కదా...?
అధిక బరువు ఉన్న ఏదోలాగా మ్యానేజ్ చేసేస్తుంటారు కొంత మంది. అయితే అధిక బరువుకు తోడు బాడీలో ఫ్యాట్ చేరితే ఆరోగ్య పరంగా అనేక వ్యాధుల భారిన పడతారంటున్నారు నిపుణులు . అధికబరువు, ఎక్సెస్ ఫ్యాట్ తో బాధపడేవారు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.

Beware! Your Body Fat Increases The Risk Of These Diseases శరీరంలో ఫ్యాట్ చేరడం వల్ల ఆరోగ్య మీద ఎలాంటి దుష్ప్రభావాలను కలిగిస్తుందో ఈ రోజు మీకు తెలియజేస్తున్నాము. శరీరంలో కొవ్వు చేరడం కేవలం ఫ్యాట్ మాత్రమే అనుకుంటారు చాలామంది. అయితే ఫ్యాట్ తో పాటే అనేక టాక్సిక్ పదార్థాలను కూడా చేరుతాయి. దాంతో హార్ట్ డిసీజ్, డయాబెటిస్, హైబ్లడ్ ప్రెజర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.
అయితే, శరీరంలో ఇలా చేరే బ్యాడ్ ఫ్యాట్ కు కారణాలేంటి? సెడెంట్రీ లైఫ్ స్టైల్ మరియు వ్యాయామ లోపం, ఈ రెండూ ప్రధాన కారణాలుగా ఉన్నాయి . అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఆయిల్స్ బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ కు కారణమవుతుంది. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టూ ఎక్కువగా కొవ్వు చేరుతుంది. వ్యాయామం ద్వారా బాడీ ఫ్యాట్ ను కరిగించుకోకపోతే, దాంతో మరిన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఎక్సెస్ బాడీ ఫ్యాట్ తో వచ్చే కొన్ని ప్రాణాంతక వ్యాధులు ఈ క్రింది విధంగా..!!

హార్ట్ డిసీజ్:

హార్ట్ డిసీజ్:

శరీరంలో చేరిన కొవ్వు హార్ట్ డిసీజ్ కు కారణమవుతుంది. హార్ట్ బ్లడ్ ను సరిగా నార్మల్ గా పంప్ చేయకపోవడం వల్ల అనేక హార్ట్ సమస్యలకు దారితీస్తుంది.

హైబ్లడ్ ప్రెజర్ :

హైబ్లడ్ ప్రెజర్ :

శరీరంలో ఫ్యాట్ పెరిగితే శరీరంలో అవయవాల మీద ప్రెజర్ పెరుగుతుంది. దాంతో జీవక్రియలు పనిచేయడానికి రక్త ఒత్తిడితో ప్రసరింపచేయాల్సి వస్తుంది. ఆ కారణంగా హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ పెరగుతుంది.

డయాబెటిస్ :

డయాబెటిస్ :

శరీరంలో ఎక్సెస్ ఫ్యాట్ చేరినప్పుడు, ముఖ్యంగా ఈ ఫ్యాట్ ఆబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ చేరడం వల్ల డయాబెటిస్ రిస్క్ ను పెంచుతుంది.

క్యాన్సర్ ప్రమాదం:

క్యాన్సర్ ప్రమాదం:

శరీరంలో అదనంగా ఫ్యాట్ చేరడం వల్ల హార్మోన్స్ మరియు సెల్స్ పెరుగుతాయి. ఇది వివిధ రకాల క్యాన్సర్ సెల్స్ ను పెంచుతాయి.ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ రిస్క్ లో పడే అవకాశాలు ఎక్కువ.

ఫ్యాటీ లివర్ డిసీజ్ :

ఫ్యాటీ లివర్ డిసీజ్ :

కాలేయం చుట్టూ ఫ్యాట్ చేరినప్పుడు, ఫ్యాటీ లివర్ డిసీజ్ కు కారణమవుతుంది. ఇది కాలేయ వ్యాధులకు దారితీస్తుంది.

బ్రీతింగ్ సమస్యలు :
బ్రీతింగ్ సమస్యలు :బాడీలో ఫ్యాట్వి చ్ఛిన్న కాకపోతే ముఖ్యంగా పొట్టలో నడుము చుట్టూ ఫ్యాట్ కరిగించుకోలేకపోవడం వల్ల చెస్ట్ వాల్స్ డయాప్రగమ్ చెస్ట్ వాల్స్ పైక్ పుష్ అప్ చేయడం వల్ల ఊపిరితిత్తుల నిండా గాలి చేరుతుంది. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు.

జాయింట్ మరియు మోకాళ్ళ నొప్పులు :

జాయింట్ మరియు మోకాళ్ళ నొప్పులు :

శరీరంలో ఫ్యాట్ పెరగడంతో, శరీరం యొక్క బరువు కూడా పెరుగుతుంది. దాంతో జాయింట్స్ మీద స్ట్రెస్ పెరుగుతుంది. దాంతో కీళ్ళనొప్పలకు దారితీస్తుంది.

బ్లడ్ క్లాట్స్ :

బ్లడ్ క్లాట్స్ :

బెల్లీ చుట్టూ , ఆబ్డామిన్ చుట్టూ ఫ్యాట్ చేరడం వల్ల రక్తప్రసరణలో ఇబ్బందులు కారణంగా డీప్ వీన్స్ లో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల రక్త గడ్డ కడుతుంది.

Post Top Ad

Post Bottom Ad