చలికాలంలో ఖర్జూరం పండ్లను తినడ వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలు…
ఖర్జూరాలు,మనలో చాలా మంది ఈ పేరు వినే వుంటారు. ఏ పండైనా ఎండినా తర్వాత తినటానికి పనికి రాదు. కాని ఖర్జూరాలు ఎండిన తరువాతే మంచి రుచిని కలిగి వుంటాయి. తాజాగా జరిపిన పరిశోధనలలో తేలిందేమిటంటే దీనిలో అత్యధికంగా ఐరన్ కంటెంట్ తో పాటు విటమిన్స్, మినరల్స్ వున్నాయని తేలింది.
ఇకపోతే చలికాలంలో ప్రతి రోజు 2 ఖర్జూరాలను తింటే ఆరోగ్యానికి అనేక లాభాలు వున్నాయంట. మరి ఆ లాభాలేంటో ఒక సారి చూద్దాం.
1. ఇవి శరీరాన్ని వెచ్చగా వుండేలా చేసుంది. అలాగే కొలెస్ట్రాల్ ను కంట్రోల్ లో వుంచటంలో గ్రేట్ గా ఉపయోగపడతాయి.
2. శరీరానికి ప్రోటిన్స్ అధికంగా అందుతాయి తద్వారా ఫిట్ గా వుండటమే కాకుండా మజిల్స్ స్ట్రాంగ్ గా అవుతాయి. అలాగే జలుబును దూరం చేయటంలో సహాయపడుతుంది.
3. దీనిలో విటమిన్ బి1, బి2, బి3, బి5 లు వుంటాయి. సో ఖర్జూరం తింటే ఈ విటమిన్స్ కూడా మన శరీరానికి అందుతాయి.
4. డేట్స్ లో క్యాల్షియం కూడా వుండటం వల్ల బోన్స్ చాలా హెల్తీగా వుంటాయి.
5. ఖర్జూరంలో వున్న పోటాషియం,సోడియం నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
6. ఐరన్ కంటెంట్ వుండటం వల్ల రక్తహీనత సమస్యలు వుండవు,జీర్ణశక్తిని కూడా పెంచుతుంది.
7. డేట్స్ లో వుండే విటమిన్ డి శరీరాన్ని కాంతివంతంగా, స్మూత్ గా వుండేలా చేస్తుంది.