భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి
భార్య రతిలో పాల్గొనడానికి భయపడడం వల్ల ఒక్కోసారి తన భర్తతో సరిగ్గా దాంపత్య సుఖంలో పాలుపంచు కోలేకపోతుంది. ఇందుకు రతిలో నొప్పి ఒక కారణం! దీనిని వైజ్ఞానిక పరిభాషలో వెజైనమస్ అంటారు.అంగప్రవేశం పట్ల అకారణమైన భయంతో జననేంద్రియం చుట్టూ వుండే కండరాలు బిగుసుకుపోయి, అంగప్రవేశాన్ని అసాధ్యం చేస్తాయి. ఏర్పడిన భయం పరిమాణాన్ని బట్టి, తొడల లోపలివైపు కండరాలు, గజ్జల కండరాలు కూడా బిగుసుకుపోయి రతిని మరింత ఇబ్బందికరంగా మలుస్తాయి. తాత్కాలికంగా ఏర్పడే ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌ల వల్ల కూడా రతిలో నొప్పి ఏర్పడుతుంది. కాని తగిన మందులు వాడితే వెంటనే నయం అవుతుంది. మానసిక కారణాల రీత్యా, లేదా గతంలో ఏర్పడిన చేదు అనుభవాల రీత్యా కాని, జననేంద్రియాల నిర్మాణం పట్ల అవగాహన లేకపోవడ, సెక్స్ అంటేనే పాపం అనే భావన అంతరంగంలో గూడుకట్టుకుపోవడం వంటి కారణాల వల్ల రతిలో బాధ, నొప్పి కలుగుతాయి.
ఈ విషయంలో దంపతులు, ముఖ్యంగా భార్యలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. భర్త తన భార్యకు గల భయాలను అర్ధం చేసుకుని వాటిని తొలగించడంలో సహకారాన్ని అందివ్వాలి. స్ర్తీకి పునరుత్పత్తి అవయవాలు నిర్మాణాన్ని వివరంగా తెలియచెప్పి సంభోగ సమయంలో కండరాల రిలాక్సే షన్ ఎక్సర్ సైలు చేయించాలి. ముఖ్యంగా భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోవాలి. భార్యకు చిరాకు కలిగించే విషయా లేమిటో ఆసక్తి కలిగించే విషయాలేమిటో తెలుసుకోవటానికి తదను గుణంగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. సంభోగం సమయం లో ఏర్పడే చిక్కులు బయటకు చెప్పుకోకపోవడానికి బిడియపడే విషయాలు. కాబట్టి భర్తే చొరవ చేసి, భార్య మనసును తెరిచేందుకు ప్రయత్నించాలి. భయాన్ని పోగొట్టాలి. అంతేకాని ఈ కారణంగా భర్యా రతికి పనికిరాదనే నిర్ణయానికి వచ్చి, కాపురాన్ని కల్లోలభరితం చేసుకోరాదు.