ఉసిరికాయ తప్పకుండా తినాలి.. ఎందుకో తెలుసా?
ఉసిరికాయలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఉసిరికాయను రుచి చూసే ఉంటారు. ఇది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ కాలంలో విటమిన్ సి ప్రాధాన్యం ఎక్కువయింది. సి విటమిన్ సరిపడినంత వుంటేనే ఆరోగ్యపరంగా సమస్య వుండదు. ఇంకా జలుబు తదితర సమస్యలను తగ్గించే గుణం వుంటుంది. సి విటమిన్ పుష్కలంగా వున్నవాటిలో ఉసిరికాయ ఒకటి.
ఉసిరికాయతో ఊరగాయలు, చట్నీలు ఆరోగ్యకరమైన జ్యూస్ వంటివి తయారు చేసుకోవచ్చు. ఉసిరికాయలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, మలబద్ధకం సమస్యలను ఉసిరిక అరికడుతుంది. ఉసిరి నోటి పూతలను కూడా నయం చేస్తుంది. 2 టీస్పూన్ల ఉసిరికాయ పౌడర్‌ను 2 టీస్పూన్ల తేనెతో కలిపి తీసుకుంటే గొంతునొప్పి, జలుబు తగ్గుతాయి. ఉసిరికాయ జ్యూస్ డయాబెటిస్ ఉన్న వారికి మరియు బరువు తగ్గాలని ఆలోచించే వారికి చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఉసిరికాయ జీవక్రియను మెరుగుపరుస్తుంది.
ఉసిరికాయ జ్యూస్ లో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల మీరు ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. అంతేకాకుండా ఈ జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది వృద్ధాప్య కణాలతో పోరాడుతుంది. రోజూ ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల అకాల వృద్ధాప్యం, మొటిమలు, చర్మంలో సన్నని గీతలు, డార్క్ ప్యాచ్ లు మరియు ముడతలు రాకుండా చేస్తుంది. ఉసిరికాయ గుజ్జులో కొద్దిగా పసుపు వేసి ఫేస్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఇది చర్మ ఆరోగ్యం మొత్తాన్ని కాపాడుతుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments