డెలివరీ తర్వాత సెక్స్ ఎప్పుడు ప్రారంభించాలి..?
భార్యభర్తల బంధానికి సెక్స్ అతి ముఖ్యమైనది. వివాహ బంధం బలపడటానికి సెక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆ బంధానికి విరామం వస్తుంది. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కొద్దికాలం సెక్స్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. అయితే స్త్రీ ఆరోగ్యం బాగుంటే ఎనిమిదో నెల వరకు సెక్స్‌లో పాల్గొనవచ్చని డాక్టర్లు చెబుతుంటారు. మరి డెలివరీ తర్వాత ఎప్పుడు సెక్స్‌లో పాల్గొనవచ్చన్న సందేహం చాలా మందిలో వస్తుంది. ఎందుకంటే ప్రసవ తర్వాత శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. చాలా మంది జంటలకు తమ లైంగిక జీవితాన్ని ఎప్పుడు పున: ప్రారంభించాలో తెలియదు. ఈ విషయంలో డాక్టర్ లేదా స్నేహితుడి సలహా తీసుకోవడానికి చాలా మంది సిగ్గు పడుతుంటారు.
చాలామంది డెలివరీ అయి నెలరోజులు దాటకముందే భార్యను సెక్స్‌కు తొందర పెట్టేస్తుంటారు. సెక్స్ అనేది ప్రసవించిన తర్వాత భార్య ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత మహిళల హార్మోన్లలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ కారణంగా సుమారు మూడు నెలల తర్వాత కూడా యోని పొడిబారే అవకాశం ఉంటుంది. తల్లిపాలు ఇచ్చే మహిళలు సహజంగా రతియందు ఆసక్తి చూపరు. సెక్స్ లో నొప్పి కలిగి బాధాకరంగా భావిస్తారు. దీనికి కారణం వీరిలో ఈస్ట్రోజన్ స్ధాయి తగ్గుతుంది. కొంతమంది మహిళలకు డెలివరీలో కనుక అధిక సమస్యలేర్పడితే, వారిలో సెక్స్ ఆసక్తి అధిక కాలం కోల్పోతారు.
ప్రసవం అయిన తర్వాత 4-6 నెలల వరకు సెక్స్‌లో పాల్గొనకూడదని కొందరు చెబుతుంటారు. దీనిని సెక్సాలజిస్టులు కొట్టిపారేస్తున్నారు. ప్రసవం తర్వాత స్త్రీ ఆరోగ్యం సక్రమంగా ఉంటే 6 వారాల తర్వాత సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చని వారు సూచిస్తున్నారు. సిజేరియన్ అయిన మహిళలు మాత్రం వేసిన కుట్లు మాని నొప్పి తగ్గేవరకు కలయికకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. నార్మల్ డెలివరీ అయిన స్త్రీలు 6 వారాల తర్వాత సెక్స్ ప్రారంభించినా గర్భ నిరోధకాలు వాడటం మంచింది. ఎందుకంటే మొదటి బిడ్డకు రెండో బిడ్డకు కనీసం 2 ఏళ్ల సమయం లేకపోతే ఉంటేనే స్త్రీ అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments