మహిళలు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు..? అనే దానిపై ఇటీవల ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది ఆ వివరాలు...
ఒంటరితనం మనిషిని వేధిస్తుంది.. కుంగదీస్తుంది... అని డాక్టర్లు చెబుతుంటారు. పెళ్లయినా, పిల్లలు ఉన్నా.. అందరూ వివిధ రకాల పనులపై బయటకు వెళ్లినప్పుడు భార్య ఒక్కరే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. దాదాపు ఇంటి పనులు కూడా అందరూ బయటకు వెళ్లే సమయానికి పూర్తయిపోతాయి. ఆ తర్వాత ఏవో కొన్ని పనులు ఉన్నా తొందరగానే ముగించుకుంటారు.
అయితే మిగిలిన సమయాన్నంతా మహిళలు ఎలా గడుపుతారు...? రోజంతా ఏం చేస్తారు..? అనే దానిపై ఇటీవల ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఆ వివరాలేమిటో చూద్దామా..?
1. తమకు ఇష్టమైన పాటలను చిన్నగా పాడుతూ ఉంటారు. వాటిని హమ్ చేస్తూ పనులు చేసుకుంటుంటారట.
2. వంట గదిలోని వస్తువులను పదేపదే సర్దుతుంటారట. వంటకు అనుగుణంగా వస్తువుల స్థానాలను మార్చుతుంటారట.
3. కుట్లు, అల్లికల వంటివి చేయడం, కరెంటు బిల్లుల వంటివాటిని కట్టడం చేస్తుంటారట.
4. బీరువాలో ఉన్న చీరలను తీసి చూసుకుంటూ ఏది ఇష్టంగా అనుకుంటే అది ధరించడానికి బయటకు తీస్తుంటారట. అంతేకాక భర్తకు ఇష్టమైన చీర ఏదో చూసి మరీ తీస్తారట.
5. టీవీ సీరియల్స్, వంట ఫోగ్రామ్స్ వంటివాటిని చూడటం చేస్తారట.
6. తమ పెళ్లి ఫోటోలు, వీడియో సీడీలు, పిల్లల చిన్ననాటి ఫోటోల వంటి వాటిని చూస్తూ ఉంటారట.
7. పిల్లలకు ఇష్టమైనవో, భర్తకు నచ్చేవో స్నాక్స్‌ను రెడీ చేస్తారట.
8. రోజులో కనీసం ఒక్కసారయినా భర్తకు ఫోన్ చేసి మాట్లాడటానికి యత్నిస్తుంటారట.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments