ఈ నియమాలు పాటించండి.. జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోండి !
ఈరోజుల్లో శుభ్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంత ఆరోగ్య కరంగా ఉంటుంది. అదేమిలేదు అని గాలికి వదిలేస్తే మన ఆయుష్షు ను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ప్రతీరోజు మనం ముఖ్యంగా చెయ్యవలసినవి..!
? రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి.
?రాగి పాత్రలో నిల్వ ఉంచిన మంచి నీళ్లు ఒక లీటర్ త్రాగండి. రాగి పాత్ర లేని వాళ్ళు కనీసం ఒక చిన్న రాగి రేకు ముక్క ని ఒక చిన్న పాత్రలో వేసి అందులో నీళ్లు పోసి ఉంచండి. కొంత సమయం తర్వాత ఆ నీళ్ళని త్రాగండి.
?నీళ్లు త్రాగిన తర్వాత కనీసం 45నిమిషాలు వ్యాయామం చేయండి. యోగా, ధ్యానం అత్యుత్తమైనవి.
?ఉదయం తీసుకునే ఆహారం చాలా త్వరగా జీర్ణం అయ్యేట్లు ఉండేలా తీసుకోవాలి. రాగి జావ చాలా చాలా మంచిది.
?ఉదయం మరియు మధ్యాహ్న భోజన సమయాలకి మధ్యలో అలాగే మధ్యాహ్న మరియు రాత్రి భోజన సమయాలకి మధ్యలో తప్పకుండా మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి.
?మధ్యాహ్న సమయంలో తీసుకునే భోజనంలో ఆకు కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీలుపడిన వరకు పీచు కూరగాయలు అధికంగా తీసుకోవాలి.
? సాయంత్రం టీ సమయంలో టీకి బదులుగా పండ్ల రసాలతో చేసిన జ్యూస్ ఒక గ్లాస్ తీసుకోండి.
?ప్రతి గంట గంటకి దాహం వేసిన దాహం వేయకపోయినా కూడా నీళ్లు త్రాగడం చాలా మంచిది.
?సాయంత్ర సమయంలో కూడా ఒక 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
?రాత్రి సమయంలో తీసుకునే భోజనం 8గంటల లోపు తీసుకోవాలి. కొందరు సూర్యాస్తమయానికి ముందు ముగిస్తారు.
? బియ్యంతో చేసిన అన్నం కాకుండా బ్రౌన్ రైస్ తో కానీ లేక దంపుడు బియ్యం తో చేసిన అన్నం తీసుకోవాలి. లేదా ఆయిల్ లేకుండా చేసుకున్న గోధుమ రొట్టెలు కానీ లేక జొన్న లేక సజ్జ రొట్టెలు తీసుకోవాలి. వీటిలోకి ఎక్కువ శాతం ఆకులు మరియు పీచు కురాలగాయలతో చేసిన కూరలను తీసుకోవాలి. మీ రాత్రి భోజనం మీ బరువుని ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది.
?భోజనం తర్వాత ఒక పండు తీసుకోవడం చాలా మంచిది. వాటిలో ముఖ్యంగా అరటి, బొప్పాయి, లాంటివి చాలా మంచివి.
?మాంసాహారం తగ్గించాలి. అవసరం అనుకుంటే నెలలో ఒకసారి వాడండి.
? రోజులో వీలైనన్ని సార్లు వేడినీళ్ళు తాగుతూ ఉంటే చాలా మంచిది.
?వారానికి రెండు నుండి మూడు సార్లు అయినా కాకర కాయ రసం ఒక గ్లాస్ తీసుకోండి.
?వారానికి ఒక్కసారైనా తలంటి స్నానం చేసుకోండి. తలంటడానికి కనీసం గంట ముందు స్వచ్ఛమైన నువ్వులనూనె, ఆముదం, కొబ్బరినూనెలతో మర్దనా చేయాలి. కేవలం కుంకుడుకాయ, శీకాయ, మెంతులు, వేప, కరివేప, మందార లతో తయారు చేసిన మిశ్రమం తో తల స్నానం చేయండి.
?చిరు ధాన్యాలను రోజువారీ తీసుకోవడం చాలా మంచిది.
? వారానికి ఖచ్చితంగా ఒక రోజు బరువు చూసుకోండి. బరువు నియంత్రణలో ఉండటానికి ఇది అద్భుతమైన చిట్కా
?ప్రతి ఆరు నెలలకి ఒకసారి విరేచన క్రియ, వామన క్రియ చేయడం చాలా చాలా మంచిది.
?ప్రతి ఆరు నెలలకి ఒకసారి వైద్యుని దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.
?ప్రతి చిన్న విషయానికి మందుల షాప్ లకి వెళ్లి ఏ మందులు అంటే ఆ మందులు తీసుకుని వాడకూడదు. ముఖ్యంగా అల్లోపతి లో చాలా జాగ్రత్త వహించాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. ఇప్పుడున్న వాతావరణంలో మనకి ఆయుర్వేద హోమియో మందులు చాలా ఉత్తమం.
?అధికంగా అల్లోపతి మందులు వాడటం కారణంగా కిడ్నీలు మరియు కాలేయ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
?ముఖ్యంగా మద్యం మరియు దూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి.
?పై నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
? ముఖ్య విన్నపం.. ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి. మీకు ఉపయోగపడకపోయినా అవసరమైన వారికి ఉపయోగపడవచ్చు..
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments