Header Ads

సపోటాలోని పోషకాలు మరియు ప్రయోజనాలు

పోషకాలు: సపోటా లో విటమిన్ A, E ఉంటాయి. వీటితోపాటు పొటాషియం, కాపర్, ఐరన్ తో పాటు గ్లూకోస్ ని కలిగిఉంటుంది. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫలమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలని కలిగి ఉంటుంది.

Health Benefits Of Sapota - -TeluguStop

ప్రయోజనాలు:

తక్షణ శక్తినిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది.
జీర్ణశక్తిని పెంచి, మలబద్దకాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ని బయటకి పంపిస్తుంది.
పొట్టలో అల్సర్లను, పుండ్లని నివారిస్తుంది. పేగులని క్లీన్ చేస్తుంది.
చర్మ సంరక్షణకు మంచిది. ముడతలు, చర్మం పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.
మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. కిడ్నీలలో రాళ్ళని కరిగిస్తుంది.
జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
కొన్నిరకాల కాన్సర్ ల బారినుండి కాపాడుతుంది.
కంటి సమస్యలను తగ్గించి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఎముకలకు బలాన్నిస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది.
జలుబు, దగ్గుకి మంచి రెమెడీ.


గమనిక: షుగర్ వ్యాధిగ్రస్థులు వీటిని తక్కువగా తీసుకుంటే మంచిది.

No comments

Post Top Ad

Post Bottom Ad