మెంతులలో సహజమైన ఔషధ గుణాలు
మనము మెంతులను సహజంగానే వంటలలో వాడుతూ ఉంటాము,కానీ ఇందులోని ఔషధ గుణాలు చాల తక్కువ మందికి మాత్రమే తెలుసు,ఈ మెంతులలో ఎన్నో ఆరోగ్య సమస్యలని నయం చేసే గుణం ఉంది.
ఈ మెంతులను ఎక్కువగా ఊరగాయాలలో,పోపులలో,పులుసు చేసేటపుడు వాడుతూ ఉంటాము. ఇందులో విటమిన్ సి,బి1,బి2,కాల్షియం లు సమృద్ధిగా ఉండడం వల్ల ఈ మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అలాగే ముక్యంగా బాలింతలు వీటిని పొడి రూపం లో తీసుకోవడం వల్ల కానీ,మెంతి కాషాయం తాగినా కానీ,మెంతికూర తిన్న గాని,వారిలో పాల ఉత్పత్తి చాల బాగా పెరుగుతుంది.
మెంతులలోని ఔషధ గుణాలు జుట్టుకి కూడా ఎంతో మేలుచేస్తుంది. అది ఎలా అంటే మెంతులు నాన పెట్టిన నీటిని తలకి పట్టించడం,లేదా మెంతులను పెరుగులో కలిపి మెత్తగా రుబ్బి తలకి పాటించడం ద్వారా జుట్టు సమస్యలు చాల వరకు తగ్గుముఖం పడుతాయి.
ఘుగర్ ఉన్నవారికి కూడా ఈ మెంతులు చాల ప్రయోజనం చేకూరుతుతాయి,మెంతులను నానపెట్టిన నీటిని రోజు తీసుకోవడం వాల్ల ఘుగర్ కంట్రోల్ కి వస్తుంది.
అలాగే జీర్ణ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఒక చెంచాడు మెంతులను నానపెట్టి ఆ నీటిని తీసుకోవడం వాళ్ళ జీర్ణ సమస్యనుండి విముక్తి పొందుతారు.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments