శృంగారానికి ముందు ఈ ఆహారం తింటే..!!?
మంచి ఆహారం మీ శృంగార సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుంది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. మీరు తినే ఆహారం సెక్స్ పై మీకున్న ఆసక్తిని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది. ఆసక్తి మాత్రమే కాదు.. ఆ సమయంలో మీ పెర్ఫార్మెన్స్ పై కూడా ప్రభావం చూపిస్తుంది. ఎప్పుడైనా సెక్స్ ను మీరు ఆస్వాదించలేకపోతున్నా.. మీలో శృంగారపరమైన కోరికలు తగ్గినట్టనిపించినా ఇదుగో ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. మళ్లీ మీలో సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా కలయికలో పాల్గొనడానికి ముందు వీటిని తింటే మీ సెక్స్ డ్రైవ్ స్పీడందుకుంటుంది.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ తిన్నప్పుడు శరీరంలో సెరెటోనిన్, ఎండార్ఫిన్లు రిలీజవుతాయి. ఇవి మీ మూడ్ ను ఉత్సాహంగా మార్చేస్తాయి. శృంగారాన్ని ఆస్వాదించాలంటే డోపమైన్ అనే హార్మోన్ కీలకం. ఈ హార్మోన్ విడుదల అవ్వాలంటే ఓ చిన్న బైట్ చాక్లెట్ తింటే సరిపోతుంది.
అవకాడో
వీగన్ డైట్ పాటించేవారు బటర్ కి బదులుగా అవకాడో ఉపయోగిస్తుంటారు. దీని రుచి అచ్చం వెన్నలాగే ఉంటుంది. దీనిలో విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే సెక్స్ హార్మోన్లు సక్రమంగా విడుదలయ్యేలా చూస్తాయి.
కాఫీ
మైండ్ రీఫ్రెష్ చేసుకోవడానికి కాఫీ తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. సెక్స్ కి ముందు ఓ కప్పు కాఫీ తాగడం వల్ల మీ లైంగిక శక్తి పెరుగుతుంది. దీనికి కారణం కాఫీలో ఉన్న స్టిమ్యులెంట్.
బాదం గింజలు
బాదం గింజల్లో అజునైన్ (arginine) అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెక్స్ హార్మోన్ డోపమైన్ విడుదలయ్యేలా చేస్తుంది. పురుషుల్లో అయితే ఎరక్షన్స్ మెయింటైన్ అయ్యేలా చేస్తుంది. బాదం గింజల్లో జింక్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా మీ లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది.
పుచ్చకాయ
శృంగారానికి ముందు పుచ్చకాయ తినడం వల్ల ఎరక్షన్స్ మెరుగుపడతాయి. పుచ్చకాయలో ఉండే సిట్రులిన్ శరీరంలో అజునైన్ విడుదలయ్యేలా చేస్తుంది. ఇది లైంగిక ఆరోగ్యంతో పాటు గుండె ఆరోగ్యాన్ని సైతం మెరుగు పరుస్తుంది.
దానిమ్మ
దానిమ్మ రసం తాగడం వల్ల ఒత్తిడి పెరగడానికి కారణమైన కార్టిజోల్ స్థాయి నియంత్రణ లోకి వస్తుంది. అలాగే శరీరంలో టెస్టోస్టిరాన్ విడుదల పెరుగుతుంది. ఇది స్త్రీపురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
బీట్రూట్
బీట్రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరు కానీ.. దాన్ని ఆహారంగా తీసుకోవడం ద్వారా శారీరక, లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. బీట్రూట్ లో ఉండే బొరాన్ మనలో సెక్స్ హార్మోన్లు మరింత ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది.
అరటిపళ్లు, యాపిల్, చికెన్, గుమ్మడి గింజలు, స్ట్రాబెర్రీ, క్యాప్సికం కూడా మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణను, కండరాల కదలికలను మెరుగుపరుస్తాయి. తద్వారా లైంగిక శక్తి, సెక్స్ కోరికలు పెరుగుతాయి. సెక్స్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments