Header Ads

Vitamin-B12: విటమిన్ బి12 లోపాన్ని ఇలా నివారించండి..

Vitamin B12 Deficiency: మానవ నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడటానికి, రక్త కణాలు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ బి 12 అత్యవసరం. దీన్నే కోబాలమిన్ అని కూడా పిలుస్తారు. ఈ విటమిన్ లోపిస్తే... బలహీనత, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం, మలబద్దకం, మానసిక సమస్యలు.. వంటి అనారోగ్యాల బారిన పడతారు.


విటమిన్ బి 12 ప్రధానంగా జంతు సంబంధ ఉత్పత్తుల నుంచే అందుతుంది. శాకాహారమైన మెక్కల ఆధారిత ఉత్పత్తులలో ఇది ఉండదు. అందుకే శాకాహారుల్లో ఈ ముఖ్యమైన పోషక లోపించే అవకాశాలు ఎక్కువ. బరువు తగ్గించే శస్త్రచికిత్స, క్రోన్స్, దీర్ఘకాలిక మద్యపానం వంటి అలవాట్లు ఉన్నవారి శరీరం... విటమిన్ బి 12ను పొందే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇలాంటి వారు డాక్టర్ల సూచనతో బి12 సప్లిమెంట్లను తీసుకోవాలి. ఈ పోషకం అధికంగా ఉండే ఆహారాలు ఇవీ.


సాల్మన్: సాల్మన్ చేప వంటి సముద్రపు ఆహారం తరచూ తీసుకుంటే శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు క్రమంతప్పకుండా అందుతాయి. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాధుల బారిన పడే ముప్పును తగ్గించడంలో తోడ్పడతాయి. దీంతోపాటు కడుపులో మంట వంటి ఇబ్బందులను తగ్గిస్తాయి. ఇది బి విటమిన్లకు ముఖ్య ఆధారం. రైబోఫ్లేవిన్, నియాసిన్, థియామిన్, బి 6, ఫోలేట్, బి 12 వంటి పోషకాలకు సాల్మన్ చేప నిలయం. యుఎస్డిఎ ప్రకారం... సాల్మన్ చేపను ఆహారంలో తీసుకుంటే బి12 శరీరానికి అవసరమైన మొత్తంలో అందుతుంది.


ట్రౌట్: ఇది మరో రకం చేప. పోషకాలతో నిండి ఉండే రెయిన్‌బో ట్రౌట్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీని ద్వారా ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, బి విటమిన్లు శరీరానికి అందుతాయి. ఈ మంచినీటి చేప జాతిలో భాస్వరం, సెలీనియం, పొటాషియం వంటి మంచి ఖనిజాలు కూడా ఉంటాయి. దీని మాంసంలో పాదరసం, ఇతర మలినాల శాతం చాలా తక్కువ. యుఎస్డిఎ ప్రకారం... రోజూ కనీసం 100 గ్రాముల ట్రౌట్ మాంసం తీసుకుంటే 7.5 ఎంసీజీ విటమిన్ బి12 అందుతుంది.

No comments

Post Top Ad

Post Bottom Ad