క్షణాల్లో నిద్ర పట్టాలంటే ఇలా చేయండి …! గాఢమైన నిద్రకు పరిష్కారాలు.
హాయిగా నిద్రపట్టాలంటే…కొందరికి ఓ పట్టాన నిద్రపట్టదు. అలాంటివారు తమ దైనందిన జీవితంలో ఈ మార్పులు చేసుకుని చూడమని చెబుతున్నారు వైద్యులు. కంటి నిండా నిద్రపోవాలి. కడుపు నిండా తిండి తినాలి అంటారు పెద్దలు. కొంతమంది పగలు నిద్రపోయి రాత్రలు మేల్కొంటూ ఉంటారు. అదేమన్నా అంటే నాకు నిద్ర పట్డడం లేదు అంటుంటారు. మరికొంతమందేమో నిద్ర సమయంలో భంగం కలుగుతుంది. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటే… మానుకునేందుకు ప్రయత్నించండి.
లండన్ యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన ఓ పరిశోదకుడు తన పరిశోదనల ఆదారంగా ఈ విషయాన్ని ధృవికరించాడు. కోపంతో నిద్రపోయిన వారి కంటే మాములుగా నిద్రపోయిన వారి మైండ్ వందరెట్లు వేగంగా పని చేసిందని.. ఉదయం ప్రశాంతగా శరీరానికి సహకరించిందని తెలిపారు. ఒకవేళ నిద్రరాకపోతే ఏం చేయాలో కూడా తెలిపాడు. సమయానికి త్వరగా నిద్రపోవాలంటే ఇలా చేస్తే చిటికెలో నిద్రముంచుకు వస్తుందని తెలిపారు.నిద్ర పట్టడానికి కొన్ని చిట్కాలు ఇదిగో.
చిటికెలో నిద్రపట్టాలంటే..
- పడుకునే ముందు సాక్సులు వేసుకుని పడుకొండి
- గదిలో తక్కువ ఉష్టోగ్రత ఉండేలా చూసుకొండి
- ఫోన్ దూరంగా పెట్టుకొని పడుకొండి. వీలైతే స్విచ్ ఆఫ్ చేయడం మేలు
- చల్లటి నీటిలో 30 సెకన్ల పాటు ముఖాన్ని ఉంచండి
- ప్రశాంతంగా మీకు నచ్చిన వారిని ఊహించుకుని కళ్లు మూసుకొండి
- అలాగే మెల్లిగా మెల్లిగా నిద్రలోకి జారుకొండి
- ఈ చిట్కాలు పాటిస్తే చిటికెలో మీకు నిద్రపట్టడం ఖాయం.
- సరైన నిద్రకు ఆహారనియమం కూడా ఎంతో అవసరం.