ఆరోగ్య సేతు(AAROGYA SETU APP)…కరోనాపై భారత్ పోరాటంలో సరికొత్త యాప్.!
కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కోవిడ్-19 బారిన పడిన వారు మన దగ్గరికి సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది.ఒక్కసారి ఈ యాప్‌ను స్మార్ట్ ఫోన్‌లో ఇన్స్‌టాల్ చేసుకుంటే.. దగ్గరలో ఉన్న ఆరోగ్య సేతు యాప్ ఇన్స్‌స్టాల్ చేసి ఉన్న స్మార్ట్ ఫోన్లను డిటెక్ట్ చేస్తుంది. ఇక ఎవరైనా కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి మరొకరితో కాంటాక్ట్‌లోకి వస్తే వెంటనే అలర్ట్ చేస్తుంది.కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్ అమల్లోకి తెచ్చింది. ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆరోగ్యసేతు యాప్ ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టంలకు కూడా అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులైతే ప్లేస్టోర్, ఐఫోన్ వినియోగదారులైతే యాప్ స్టోర్ నుంచి ఈ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
Download and Install Aarogya Setu App
Step 1: Install Aarogya Setu App in Google Play Store or iOS App Store
1) ముందుగా మీరు ప్లేస్టోర్, యాప్ స్టోర్ లో Aarogya Setu అని టైప్ చేస్తే మీకు ఆ యాప్ కనిపిస్తుంది. వెంటనే వాటిని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి. బ్లూటూత్ మరియు మీ లొకేషన్ పర్మిషన్ ఆన్ చేయండి.
Aarogya Setu App Free Download Link
Android >> Download Here
iOS >>> Download Here
Step 2: Enable Language and Select Desired Option
2) యాప్ ఓపెన్ చేయగానే భాషను ఎంచుకోమని అడుగుతుంది.ఈ ఆరోగ్య సేతు యాప్ లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉన్నాయి.
Step 3: App Permissions and OTP Validation
3) భాషను ఎంచుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ తో యాప్ లాగిన్ అవ్వమని అడుగుతుంది.ఆ తర్వాత మీకు ఓ OTP వస్తుంది. దాన్ని యాప్‌లో ఎంటర్ చెయ్యాలి.
Step 4: Enter Relevant Details and Information
4) ఆరోగ్య సేతు యాప్ లాగిన్ అయిన వెంటనే.. పేరు,వయస్సు,లింగం, వృత్తి మరియు మీరు గత 30 రోజుల్లో ఏయే దేశాల్లో పర్యటించారనే సమాచారం ఇచ్చి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
Step 5: Choose Volunteer Service Option
5) మీరు కరోనా సేవల్లో వాలంటీర్‌గా పాల్గొంటారా అని అడుగుతుంది. మీరు Yes అని చెబితే… 20 సెకండ్ల అసెస్‌మెంట్ టెస్ట్ మొదలవుతుంది. No అని చెప్పితే యాప్ హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
Step 6: Check Your Homepage and Recommendations As Suggested
6) ఆరోగ్య సేతు యాప్ యొక్క హోమ్‌పేజీ ఓపెన్ చేయగానే అక్కడ ఇది మీకు ఉన్న రిస్క్ స్థాయిని చూపుతుంది. ఇక్కడ ‘మీరు సురక్షితంగా ఉన్నారు’ అని టెక్స్ట్‌తో గ్రీన్‌లో చూపిస్తుంది.
యాప్‌లో ఉన్న సమాచారాన్ని వినియోగించుకుని భారత ప్రభుత్వం కరోనావైరస్ సంబంధిత డేటాబేస్ తయారు చేస్తుంది. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దీన్ని ఉపయోగించుకుంటుంది. ఆరోగ్య సేతు యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల వినియోగదారులు కరోనాపై అప్రమత్తం అవుతారు అని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ ఇది. ఇప్పటి వరకు ఈ యాప్ ని 10 మిలియన్ల మంది యూజర్లు ఇన్స్టాల్ చేసుకున్నారు.
Download Aarogya Setu App and help India win this fight against COVID 19:
Aarogya Setu App Download Link
Android >> Download Here
iOS >>> Download Here
Aarogya Setu App Review
Aarogya Setu is a mobile application developed by the Government of India to connect essential health services with the people of India in our combined fight against COVID-19. The App is aimed at augmenting the initiatives of the Government of India, particularly the Department of Health, in proactively reaching out to and informing the users of the app regarding risks, best practices and relevant advisories pertaining to the containment of COVID-19.
The Aarogya Setu App detects other devices with app installed that have come in the Bluetooth / GPS proximity of your phone and captures this information. In the unfortunate case of any of those recent contacts Test positive, the App calculates your risk of infection based on recency and proximity of your interaction and recommends suitable action
PROS:
- Need of the hour solution
- Plain and Simple User Interface
- Multi Language Support
- Up to Date Info
CONS:
- Turns on the bluetooth for the covid scan but won’t turn off while exiting the app.
- Scroll down does not work properly.
- The app just tell basic info about the risk of infection.
- No In-APP Feedback