రెండో బిడ్డ తర్వాత దాంపత్య జీవితం లో ప్రేమానురాగాలు ఎక్కువవుతాయట
అవును మీరు విన్నది నిజమే. రెండో బిడ్డ తర్వాత దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయట. ఇది చెప్తుంది దీని పై పరిశోధనలు చేసిన మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు. 200 వందల పైగా జంటలపై చేసిన పరిశోధనలలో కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు చెప్పారు.
అవేమిటంటే తొలి బిడ్డ పుట్టాక చాలా మంది జంటలు దాంపత్య సరిగ్గా అనుభవించలేకపోతున్నారన్ని, ఏదో ఒక కారణం చెప్పి తన భాగస్వామితో శృంగారానికి దూరంగా వుంటున్నారని, ఇక ఈ సమస్య భార్య భర్తలు ఇద్దరికి వుంటే వారి విడిపోయే వరకు వెళ్తుందని వీరు చెప్పారు. ఇక రెండో బిడ్డ పుట్టే సరికి అప్పటికి వారికి బిడ్డను పెంచడం అలావాటు అయిపోయి వుంటుంది. అలాగే ఇంకో బిడ్డను కనాలి అన్న తాపత్రయం కూడా వుండక పోవటం వల్ల భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు పెరుగుతాయని వారు తెలిపారు.