ఆరోగ్య వంతుడైన ఒక మనిషి ఒక రోజులో ఎక్కువ సార్లు దీని గురించే ఆలోచిస్తాడట
పెళ్ళంటే నూరేళ్ళ పంట! నిజమే. పెళ్ళి చేసుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఎన్నో ఏర్పాట్లు చేసుకుంటాం. మంచి కుటుంబంలో అమ్మాయిని పెళ్ళాడాలనుకుంటాం. అటువారు ఇటు వారు లక్షలు ఖర్చుపెడతారు. ఎంతో ఆర్భాటంగా పెళ్ళి చేసుకుంటాం. పెళ్ళికోసం తీసుకున్నన్ని జాగ్రత్తలు, ప్లానింగ్ బెడ్రూములో సెక్స్ విషయంలో పాటించం. దాన్నో సాధారణ విషయంగా మార్చేసి ‘ఏదో అయ్యింది’ అనిపించేస్తాం. కానీ ఆరోగ్య వంతుడైన ఒక మనిషి ఒక రోజులో చాలా ఎక్కువ సార్లు సెక్స్ గురించే ఆలోచిస్తాడట. ప్రాక్టికల్ విషయాల్లో సమస్యలు ఎదుర్కొంటున్నవారు కౌన్సి లింగ్ తీసుకోవడానికి సిగ్గుపడుతూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. సంప్రదాయబద్ధమైన దేశాల్లో స్ర్తీ పురుషులు సెక్స్ జీవితాన్ని సంపూర్ణంగా ఎంజాయ్ చేయకుండా అసంతృప్తులతో బతికేస్తున్నారు. ఈ అసంతృప్తులే పెరిగిపెద్దవై, మహావృక్షాలుగా మారి అక్రమ సంబంధాలకు దారితీస్తున్నాయని, అవికూడా తృప్తినివ్వలేక హింసా త్మకంగా మారుతున్నాయనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయాలంటే స్పష్ట మైన దృక్పథంతో ఉండాలి. సమస్యను నిపుణులతో కాకుండా సన్నిహితులైనవారితో చర్చించడం వల్ల శాస్త్రీయ పరిష్కారాలు లభించకపోవడం, తెలిసీ తెలియని సలహాలతో కాలక్షేపం చేయడమే జరుగుతోందట. నియమబద్ధ జీవితానికి కట్టు బడి సరైన అవగాహన పెంపొందించుకుంటే సెక్స్‌ను బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయవచ్చునంటున్నారు. సెక్స్ విషయంలో మానసిక పరమైన ముందస్తు ఊహలు, ఫీలింగ్స్ డామినేట్ చేయడం వల్ల స్ర్తీ పురుషులు, ముఖ్యంగా మగవారు స్ర్తీని సంతృప్తిపరచలేననే భావంతో సంపూర్ణంగా సెక్స్ జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఏదో ఆ క్షణానికి అయ్యిందనిపించి కోరిక తీర్చుకుని తప్పించుకు తిరగడం వల్లనే ఎన్నో కుటుంబాల్లో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంతోమంది స్ర్తీలు ఆత్మన్యూనతతో భర్తలకు చేరువకాలేక పోతున్నారు. నియమబద్ధమైన జీవితానికి అవగాహన తోడైతే భాగస్వామితో కొత్త కొత్త భంగిమలు ట్రై చేస్తూ అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ సెక్స్ అసంతృప్తుల్ని తరిమికొట్టవచ్చునంటున్నారు.