ఆడవాళ్ళకి కావాల్సింది మగాడా? మొగుడా?
మానవ సంబంధాల్లో మార్పులు సహజం. ఒక దశ నుంచి మరో దశకు ప్రయాణించే క్రమాన మార్పులు అనివార్యం. అయితే మంచి దిశగా జరిగే మార్పును స్వాగతించడం మానవనైజం. ఇందుకు విరుద్ధంగా నెలకొనే పరిణామాలు ఆందోళనకరం. ఇప్పుడు మానవ సంబంధాల్లో నెలకొంటున్న విపరిణామాలు కుటుంబవ్యవస్థకు పెనుసవాల్‌గా నిలిచాయి.
వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ రెండింటినీ అత్యున్నతమైన వ్యవస్థలుగా సమాజం పరిగణించింది. వీటిలోని అమానవీయ, ఛాందస విధానాలు మారాలని ఆశించింది. ఈ రెండు వ్యవస్థల్లోనూ ప్రజాస్వామ్య రీతి నెలకొనడం కోసం మనుషులు పోరాడుతూ వచ్చారు. అంతేతప్ప ఈ రెండు వ్యవస్థలు సమసిపోవాలని అభిలషించలేదు. ఎందుకంటే లోపాలున్నప్పటికీ ఈ రెండింటినీ మానవ సంబంధాల ఉన్నతికి దోహదపడే వ్యవస్థలుగా భావించింది సమాజం.
నాగరిక సమాజంలో బ్రతుకుతున్న మనిషి నైజంలో మాత్రం చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు కుటుంబ వ్యవస్థకి విలువ ఇచ్చే ప్రజలు ఇప్పుడు కలిసి ఉండటానికి కుటుంబం అవసరం లేదు కదా అనే స్థాయికి ఎదిగిపోయారు. పెళ్లి అనే బంధంతో ఒకటయ్యే స్త్రీ, పురుషులు కేవలం ఆ సుఖాల కోసం మెళ్ళో మూడు ముళ్ళు వేసుకోవాలా అనేంతగా ఆలోచన పెంచుకున్నారు.
నాగరిక సమాజంలో మనం అనే మాటని ఖననం చేసేసి, నాది అనే మాటకి జీవం పోసి, ఈ సమాజంలో నడిపిస్తున్నాం. అందుకే బంధం లేదు, బంధుత్వం లేదు, అభిమానం లేదు, ఆప్యాయత లేదు, తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లి అనే అనుబంధాలు ఎప్పుడో వద్దనుకునే స్థాయికి చేరిపోయారు. ఇప్పుడు కావాల్సింది అంతా అవసరం, అవకాశం. నా కోరికలు తీర్చుకోవడానికి నాకు కావాల్సింది ఏంటి అనే ఆలోచనకి వచ్చిన జనం దానికి కావాల్సిన స్వార్ధం, మోసం, ఇచ్చ అనే ఉచ్చరించడానికి కూడా తప్పుగా భావించే గుణాలని నిలువెల్ల నింపేసుకున్నారు.
అలా నిండిన మనుషుల మధ్యలో ముందుగా చెప్పుకోవాల్సింది ఆడవారి గురించి. సమాజంలో తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా వాళ్లకి చాలా గొప్ప స్థానాన్ని మగాడు ఇచ్చాడు. మగాడి బలం, బలహీనత రెండు ఆడది. కాని ఇప్పుడు ఆ ఆడది మగాడికి బలహీనత అయిపోతే. ఆ బలహీనత ఆడదానికి అవకాశం అవుతుంది. పెళ్ళైన మహిళకి భర్త కావాల్సినవన్నీ ఇస్తాడు. కాని ఆమెకు మరో మగాడు కావాలి. భర్తకి తెలియకుండా ఆ మగాడికి చేరువ అవుతుంది.
ఎప్పుడైతే భర్తకి తెలుస్తుందో కనికరం లేకుండా ప్రాణాలు తీసేస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు చాలా వెలుగు చూసాయి. భర్త ఉండి కూడా పరాయి మగాడితో సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్న ఆడవాళ్ళ గురించి రోజు చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ఇక మరి కొందరు ఆడవాళ్ళు పరాయి మగాడితో సంబంధం పెట్టుకొని వాడిని నిలువనా వాడేసి తరువాత కాదని బయటకి గెంటేయడం, ఎక్కువ చేస్తే చంపేసి వదిలించుకోవడం, కుదరకపోతే తనని శారీరకంగా, మానసికంగా వేదిస్తున్నాడు అని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, చట్టాన్ని తనకు నచ్చినట్లు వాడుకోవడానికి ప్రయత్నించడం.
ఇవన్ని చూస్తుంటే ఆడవారి మీద ఉన్న గౌరవం రాను రాను నశించి పోతుంది. అందుకే సమాజంలో వారిపై జరుగుతున్న దురాగతాలు అని చాలా మంది అంటారు. ఆడవారికి కావాల్సింది మొగుడు కాదు. వారి అవసరాలు తీర్చే మగాడు. వాడు ఒక్కడు మాత్రం కాకూడదు అనే ఆలోచనతో ఆడవారు ఉన్నప్పుడు, తామెందులో తక్కువ అంటూ ఇప్పుడు కుర్రకారు బుర్ర నిండా చెత్త ఆలోచనలు నింపుకొని పెళ్ళైన ఆడవాళ్ళు అయితే ఈజీగా పడిపోతారు అని, వారి జీవితాల్లోకి దూరిపోయి, కుటుంబ వ్యవస్థ, భార్య భర్తల బంధం నాశనం కావడానికి కారణం అవుతున్నారు. ప్రతి ఒక్కడు మన భార్య బాగుండాలి.
మన ఇంట్లో వేరే మగాడు దూరకూడదు, కాని వేరే పెళ్ళాం మాత్రం మనకి కావాలి, వేరే వాడి లైఫ్ లోకి దూరిపోయి వారి సంసారం నాశనం చేయాలి అనే ఆలోచనతో ఉన్నాడు. మగాడి ఆలోచనని సరిగా అర్ధం చేసుకోలేని మహిళలు, వారి పొగడ్తలకి, వారు ఇచ్చే బహుమతులకి, వారు అందించే ఓదార్పుకి లొంగిపోయి వారితో సంబంధం పెట్టేసుకుంటున్నారు. ఇలా ఈ సమాజంలో ఆడ మగ మధ్య సంబంధాలు కేవలం శారీరక సుఖాలకి మాత్రమె పరిమితం అయిపోయి.
ఆడ, మగ అనే ఆలోచన తప్ప, భార్య-భర్త అనే ఆలోచనకి ఎదగలేకపోతున్నారు. మరి నాగరిక సమాజంలో మనిషి దిగాజారినట్ల, ఎదిగినట్ల అనేది ఎవరికీ వారు ఒక్కసారి పరిశీలించుకోవాలి.స్వేచ్ఛా సమానత్వాలు స్త్రీ పురుష సంబంధాలకు ప్రాతిపదిక కావాలి. తద్వారా పరస్పరం ఆత్మగౌరవంతో జీవించే ఔన్నత్యం నెలకొంటుంది. ఈ చైతన్యమే పటిష్టమైన, ప్రేమపూరితమైన కుటుంబ బంధాలకు ఆలంబన.
No comments