మొదటిరాత్రి పాలగ్లాసునే ఎందుకు ? ఫస్ట్‌నైట్ పాలగ్లాసు రహస్యం ఇదే..!
జీవితంలో వివాహం అతి ప్రధానఘట్టం. ఆ ఘట్టంలో మొదటిరాత్రి మరింత కీలకం. ఆ రాత్రి వధువు పాలగ్లాసుతో లోనికి వస్తుంది. ఎందుకు పాలగ్లాసునే మొదటిరాత్రి ఎంచుకుంటారు ? అందులోని మర్మం ఏమిటి? అనే ప్రశ్న చాలామందికి కలుగుతుంది. ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తిచేసే మన దేశంలో పాలను పంచామృతాల్లో ఒకటిగా భావించడం, దంపతులు మొదటిరాత్రి కలిసి పాలు పంచుకుంటే జీవితం శుభకరంగా ఉంటుందనే సంప్రదాయ విశ్వాసం ఒక కారణం కావచ్చు. కానీ అప్పటివరకు అపరిచితులుగా ఉన్న స్ర్తీ పురుషులు భార్యాభర్తల బంధం పేరిట మొదటిరాత్రి, మొదటిసారి ఏకాంతంగా కలిసినప్పుడు ఎంత మేనేజ్ చేసినా వారిలో అంతర్గతంగా భయాందోళనలు ప్రభావితం చూపిస్తాయి.
వీటి నియంత్రణకు పాలు దోహదం చేస్తాయి. పాలు త్వరగా జీర్ణం అవుతాయి. న్యూట్రిషన్ ఫుడ్. పాలు తాగడం వల్ల హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. దీనివల్ల వారిలో ఆందోళన సర్దుకుని, హ్యాపీనెస్ వస్తుంది. పాలల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇందులో కార్పోహైడ్రేట్స్, ఎమినో యాసిడ్స్, లాక్టోజ్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. రక్త ప్రసరణ ఫ్రీ మూమెంట్‌కి వస్తుంది.
మగవారికి సెక్స్‌లో అవసరమైన ఈస్ర్టోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్లు భారీగా విడుదలై మొదటిరాత్రి దంపతుల జీవితం మరింత మధురమైన, మరపురాని రాత్రిగా మిగిలిపోవడానికి పాలు ఎంతో దోహదం చేస్తాయి. పైగా ఇందులో బాదం పప్పు నూరి వేయడం వల్ల హార్మోన్లు యాక్టివేట్ అవుతాయి. ద్విగుణీకృతమైన ఉత్సాహం వారిలో పెల్లుబుకుతుంది. జీర్ణశక్తి, జ్ఞాపకశక్తి పెంచడానికి పాలు మరింత దోహదం చేస్తాయి. చాలా మంది సంతానలేమితో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండటం కోసం స్ర్తీ, పురుషులు ఎవరైనా పాలు తాగడానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సంతానోత్సత్తికి అవసరమైన స్పెర్మ్ కౌంట్ పుష్కలంగా పెరుగుతుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments