ఆన్ లైన్ లో ఓ వ్యక్తితో పరిచయం.. ఎప్పుడూ సెక్స్ గురించే మాట్లాడతాడు.. సరే ట్రై చేద్దామనే ఉద్దేశంతో
ప్రశ్న :-
ఇటీవలే నాకు ఆన్ లైన్ లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడంతో మా పరిచయం కాస్తా ఫ్రెండ్ షిప్ స్టేజ్ దాటి ఇంకాస్త అడ్వాన్స్ అయ్యింది. నాకు అతడికున్నంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ లేనప్పటికీ.. నేను కూడా సరే ట్రై చేద్దామనే ఉద్దేశంతో అతనితో రిలేషన్ షిప్ లోకి ఎంటరయ్యాను. ఇప్పుడు అతనితో వచ్చిన సమస్యల్లా ఒక్కటే..! ఎప్పుడూ సెక్స్ గురించే మాట్లాడతాడు. ఏదో ఓ విధంగా సెక్స్ గురించే ప్రస్తావిస్తాడు. తనకి నాతోనే ఎప్పుడూ కలిసి వుండాలనుంది అని చెబుతుంటాడు. అతడు అలా చెబుతుంటే చాలా చిరాగ్గా అనిపిస్తోంది. బహుశా మగాళ్లందరికీ అలాగే వుంటుందా లేక నాకు స్ట్రాంగ్ ఫీలింగ్స్ లేవు.. కనుకే అలా అనిపిస్తోందా? నాకేం అర్థం కావడంలేదు. దయచేసి సలహా ఇవ్వండి.
మానసిక వైద్యులు సలహా :-
మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. మీ బంధం ఎటువంటిదో మీకే స్పష్టత లేదు.. కనుక ఇది కొంచెం గందరగోళమైన పరిస్థితిలాగే అనిపిస్తోంది. పరిస్థితి చూస్తోంటే, ఏం జరిగితే అదే జరిగిందిలే అనే ధోరణిలో మీరు వ్యవహరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. అందుకే అసలు అతడి గురించి మీ ఆలోచన ఏంటనే విషయంలో ఓ స్పష్టతకి రావాల్సి వుంటుంది. అతడితో మీకు కేవలం శారీరక సంబంధమే వుందా లేకా ఇంకేమైనా వుందా అని ఓసారి పునరాలోచించుకోండి. మిమ్మల్ని శారీరకంగా మాత్రమే కోరుకునేవాడితో కాకుండా అన్నివిధాల ప్రేమించేవాడితో మీరు కలిసి వుండటం అనేది ఎంతో అవసరం. అయితే అదే సమయంలో మీరు కూడా అతడిపట్ల అంతే ప్రేమానురాగాలు కలిగి వుండటం అనేది కూడా చాలా ముఖ్యం అనే విషయాన్ని గ్రహించాల్సి వుంటుంది.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments