Header Ads

PCOD: పీరియడ్స్ లేటయితే పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయా?

ఆ రోజు వుదయాన్నే, ఆపరేషన్ థియేటర్ కి వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుండి తిరిగి వచ్చేసరికి, ఓపీ ఎప్పుడూ లేనంత రద్దీగా వుంది. నా గది ముందు నలుగురైదుగురు పేషంట్లు ఎదురు చూస్తున్నారు.

PCOD - Causes, Symptoms and Treatment - By Dr. Vandana Hegde | Lybrate 

 



వీల్ చెయిర్లో కూర్చున్న బామ్మగారిని ముందు పంపమన్నాను.

గర్భధారణ

ఆమెను లోపలికి తీసుకురాబోతుంటే, హడావుడిగా అడ్డం వచ్చింది ఒక నర్స్. ఆమె మా హాస్పిటల్లోనే డయాలసిస్ యూనిట్లో పనిచేస్తోంది.

''ప్లీజ్ మామ్మగారూ చాలా అర్జంటు. మేము ముందు చూపించుకుంటాం'' అంటూ బతిమాలుతోంది.

''పర్లేదమ్మా, గంట నుండి కూర్చున్నాను. ఇంకో పావుగంట కూర్చోలేనా? వెళ్లండి''. ఒప్పుకుంటోంది బామ్మగారు.

ఏవిఁటంత అర్జంటు.

ఆమె పక్కనే ఒక యువతి వుంది.

''బామ్మగారిని చూస్తాను. ఒక్క పది నిముషాలు వెయిట్ చెయ్యండ’’ని చెప్తే, పేషంటులా వచ్చిన యువతి సరేనన్నట్టు తలూపి, బాగ్ వళ్లో పెట్టుకుని తలొంచుకుని కూర్చుంది. వడిలినట్టున్న ముఖం. మనిషి నీరసంగా వుంది.

ఆమెను తీసుకుని వచ్చిన నర్స్ మాత్రం అసంతృప్తిగా నిలబడింది.

బామ్మగారిని చూసి పంపించే వరకూ ఆమె కంగారుగా తిరుగుతూ వుంది. లోపలికి రమ్మనమనగానే సుడిగాలిలా వచ్చింది.

''చాలా ఆశగా వచ్చాము మేడం. మీరే ఏదైనా చెయ్యాలి.''

మీరే సహాయం చెయ్యాలంటూ బ్రతిమాలుతోంది.

ఏ విషయంలో అంటే,

ఆమె తన అన్న భార్యని తీసుకుని వచ్చింది. పిల్లలు కలగడం 

లేదన్న కారణంతో.

రుతుస్రావం 

నిన్నంతా వాడు మంచి నీళ్లు కూడా తాగలేదు. వాడే కాదు మేడం, అందరం చాలా టెన్షన్తో వున్నాము.''

''ఏవైంది?''

''వదినకు ఇన్ఫెర్టిలిటీ మేడం. ఇంట్లో ఎవరమూ సంతోషంగా లేము. మీరెలాగైనా సరే తనకు ప్రెగ్నన్సీ వచ్చేట్టు చేయండి. ఎంత మంచి మందులైనా సరే వాడండి. వీలైతే ఫారెన్ మందులైనా సరే. అసలు తనకేం ప్రాబ్లం వుందో చూడండి.''

తనతో వచ్చిన నర్స్ మాట్లాడుతోంది.

''మీ పేరేంటి?'' అడిగాను.

''వర్థని మేడం. ఇదివరకు మా అమ్మగారికి మీరే ఆపరేషన్ చేశారు. అమ్మ కూడా వదిన్ని మీదగ్గరే చూపించమని మరీ మరీ చెప్పింది.'' చెప్పింది.

నేను పక్కనున్న యువతి వంక చూస్తున్నా.

ఆ అమ్మాయి తలొంచుకుని కూర్చుంది. వరసకు వదినైనా, ఆ పిలుపుకింకా చిన్నదే అనిపించింది. వంపు తిరిగిన ముక్కు. చిన్ని గడ్డం. మధ్యలో ఎర్రని పెదవులు. ఆమె లిప్ స్టిక్ కొనాల్సిన అవరసం లేదు. కళ్ల నిండా దిగులు.

అసౌకర్యంగా కదులుతోంది.

''ఏమ్మా, బాలేదా?" అడిగాను.

కళ్లెత్తి చూసింది. తన బాధ నాకర్థమవుతుందో లేదోనని చూసే బేల కనులు. చాలా సార్లు చూపుల్లో వున్నంత స్పష్టత, మాటల్లో వుండదు.

''చెప్పండి. బాలేదా?'' ధైర్యమిచ్చాను.

''కడుపులో నొప్పి. ఇవాళ రెండో రోజు.''

అంటే నిన్న ఋతుక్రమంలో మొదటి రోజు. కొత్త కోడలు నెల తప్పాలి తప్పాలి అని తపన పడ్డారు. పీరియడ్స్ రాగానే, అందరిలోనూ నిరాశ, నిస్పృహ.

పీరియడ్స్

తనకు పీరియడ్స్ కూడా సరిగా రావు. ఎప్పుడూ లేటే! పెళ్ళికి ముందు మాకు తెలియదు మేడం, తనకిలా కడుపులో నొప్పి వస్తుందని. తనకు పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి మేడం.'' ఆమె ముఖం చూడకుండా చెప్పుకుపోతోంది వచ్చినామె.

ఆ అమ్మాయి ముఖంలో బాధ చూసి

''నొప్పికి టేబ్లెట్ ఏమైనా వేసుకున్నావా?'' అని అడిగాను.

''వద్దు, టేబ్లెట్లొద్దు. అట్లా టేబ్లెట్లు వాడితే ప్రెగ్నన్సీ ఇంకా లేటవుతుంది. అయ్యేవీ వద్దండీ." అంటూ అడ్డుపడుతున్న వర్ధనితో,

"చూడండి సిస్టర్, అండం విడుదలకు సూచనగా మొదటి రోజు నొప్పి వస్తుంది. అదేమీ జబ్బు కాదు. నొప్పి తగ్గేందుకు మాత్ర వేసుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. టేబ్లెట్లు వేసుకున్నా పిల్లలు పుడతారు." చెప్పాను.

బెల్ కొట్టి నర్స్‌ని పిలిచి ఒక టేబ్లెట్ తెప్పించాను.

ఆ అమ్మాయి వేసుకున్నాక

"తనకెప్పుడూ పీరియడ్స్ లేటే మేడం" వర్ధని కొనసాగించింది.

"ఎన్ని రోజులు లేటుగా వస్తుంది?"

"అయిదార్రోజులు." ఆ అమ్మాయి చెప్పింది.

"లేటుగా వస్తే పిల్లలు కలుగుతారా మేడం. నాకలా కాదు. సరిగ్గా అదే డేట్‌కు వచ్చేస్తుంది. కేలెండర్ చూడక్కర్లేదు. ఒక్క రోజు కూడా అటూ ఇటూ కాదు."

"స్త్రీలలో కొంత మందికి 35 రోజుల సైకిల్ వుంటుంది. సరిగా ఒకే డేట్‌కు రావడమనేది అందరిలో జరగదు. అదేమీ అసహజం కాదు. పిల్లలు కలగడానికి అవరోధమూ కాదు."

"అంతే కాదు మేడం. తనకు పి సి ఓ డి వుంది. ముఖం మీద హెయిర్ కూడా. చూపెట్టు వదినా, డాక్టర్ల దగ్గర సిగ్గు పడకూడదు." అంటూ ఆమె గడ్డం పైకెత్తి చూపెట్టబోతే

ఇక నేనైనా సిగ్గుపడక తప్పదనుకుని లేచాను.

"చూడండి. అలా చెయ్యొద్దు." వర్థనితో చెప్పి, "నాతో రండి." అన్నాను ఆ అమ్మాయితో .

"వదినా, మేడం పరీక్ష చేస్తారు. కొద్దిగా నొప్పిగా వుంటుంది, అయినా వోర్చుకో. కో ఆపరేట్ చెయ్య’’మని వెనక నుండి చెప్తోంది ఆడపడుచు.

భర్తల దౌర్జన్యమైనా నాలుగ్గోడల మధ్య జరుగుతుందేమో కానీ, అర్థ మొగుళ్లు ఏం చేసినా పబ్లిక్కులోనే .

పీసీఓడీ


లోపల స్కానింగ్ గదిలోనికి తీసుకెళ్లగానే ''పడుకోమ్మా" అని పరీక్ష చేసే టేబుల్ మీద షీట్ అది సరిచెయ్యబోయింది మా నర్స్.

చేతిలో వున్న ఫైల్ పక్కన పెట్టి టేబుల్ ఎక్కబోతుంటే వారించి కూర్చోబెట్టాను.

రెండవ రోజు. కడుపులో నొప్పి. నీరసం. ఏమీ తిన్నట్టు లేదు. అయినా టేబుల్ మీద పడుకోవడానికి సిద్ధమైంది.

"పరీక్ష ఇప్పుడు వద్దు. తర్వాతెప్పుడైనా చేస్తాను."

ఆ ఫైలు తీసుకుని చూశాను. చాలా మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళొచ్చినట్టున్నారు. బరువైన ఫైలు తయారయ్యింది.

రిపోర్ట్స్ దాదాపు అన్నీ మామూలుగానే వున్నాయి.

PCOD అన్న వివరం వ్రాసి వుంది.

ఆమె చదువు వివరాలు కనుక్కున్నాను.

లా డిగ్రీ చేశానని చెప్పింది.

పొలిటికల్ సైన్స్‌లో పీజీ చెయ్యాలని వుందట. ఇంతలో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేశారట.

"ఎన్నాళ్లయింది పెళ్లయి?"

"పది నెలలు."

"అంతేనా? పదినెలలకే ఏమిటింత కంగారు? ఇప్పుడు చదువుకోవచ్చుగా. "

"అదే మేడం, ప్రెగ్నన్సీ విషయం తేలితే, ఇక కెరీర్ చూసుకోవచ్చు. ఒకరిని కనేస్తే," వాక్యం సగంలో ఆపింది.

'ఒకరిని కనేస్తే!'

పులుసు వండేస్తే , ఇహ అన్నం పొయ్యిమీద పెట్టొచ్చు అన్నంత యాంత్రికంగా వుంది ఆ మాట.

"ఆయన కొలీగ్స్ అడుగుతున్నారట మేడం, విశేషమా అని. మా ఆడపడుచు పెళ్లైన మూణ్ణెల్లకే నెల తప్పిందట. మా అత్తగారూ సంవత్సరం లోపే. నాకింకా ప్రెగ్నన్సీ రాలేదని అందరూ కంగారు పడుతున్నారు."

గర్భం

ఋతుక్రమం ఎలా వస్తుందో అడిగాను.

"మొదట్లో చాలా రెగ్యులర్ గా వచ్చేవి మేడం. పెళ్లైన దగ్గర్నుండీ అయిదార్రోజులు లేటుగా వస్తున్నాయి. ఓ రెండు రోజులు లేటవగానే యూరిన్ టెస్ట్ చెయ్యమంటారు. నెగటివ్ రాగానే," చెప్పడం ఆపింది.

రెండు క్షణాల తర్వాత

"నెల దగ్గరవుతుందంటే, మెన్సెస్ వస్తోందంటే భయమేస్తోంది. నిద్ర కూడా పట్టదు."

ఎర్రని కలువలు కొలనులయ్యాయి.

"మెన్సెస్ వస్తే డిజప్పాయింట్ కావడం. పది రోజులు మాట్టాడడు. ఏదో ఒకటి చెయ్యండి మేడం. ప్రెగ్నన్సీ రావడానికి. ప్లీజ్."

ఆమె చిన్నగా మాట్లాడుతోంది నాకు మాత్రమే వినబడేట్టు.

పరీక్షకు మామూలుగా పట్టే సమయం అయిపోవచ్చిందని నాకు మనసులో తట్టగానే, తలుపెవరో తట్టారు.

ఎవరయ్యుంటారో కూడా అర్థమైంది.

"అయిందా పరీక్ష." అంటూ వచ్చింది వర్థని.

"ఏంటి మేడం ప్రాబ్లమేమిటి? ఎందుకు రావడం లేదు ప్రెగ్నన్సీ? PCOD వుందా?"

PCOD లేకపోతే, ఎంత ఖర్చైనా పర్లేదు తెప్పించాలన్న పట్టుదలతో వున్నట్టుంది ఆమె.

"వాళ్లకు పెళ్లయి ఎంతకాలమవుతోందో తెలుసు కదా."

వదినా ఆడబడుచులిద్దరూ సమాధానమివ్వలేదు.

"పది నెలలు. కనీసం ఒకటిన్నర సంవత్సరం అయేవరకూ మేము ఎవరికీ పరీక్షలు చేయం. ఆరోగ్యంగా వున్న భార్యాభర్తలు కలిసి జీవిస్తూ, ఏ గర్భ నిరోధక సాధనమూ వాడకపోతే, ఆ జంటలలో 83% మందికి మొదటి సంవత్సరంలో 92% మందికి రెండో సంవత్సరంలోనూ గర్భం వస్తుంది. హడావుడి పడాల్సిన అవసరమేమీ లేదు."

"కానీ మా రాజేష్, అంటే మా కజిన్, వాడు ముంబైలో వుంటాడు. అన్నకీ, వాడికీ ఒకేసారి పెళ్లి అయింది. వాడి వైఫ్ కిపుడు ఆరో నెల."

"ఇదేమీ రన్నింగ్ రేస్ కాదు. ఒకరితో పోటీ పడడానికి. వేరొకరితో పోల్చవలసిన అవసరం లేదు."

"తనకు PCOD వుందిగా మేడం. మా ఆదుర్దా మాది." నిష్టూరంగా అంది.

"PCOD అంటే, అదేమీ పిల్లలు కలగని జబ్బు కాదు. హార్మోన్ల సమతుల్యత లోపిస్తుంది. 40 - 50 శాతం మంది బరువు పెరుగుతారు. ఆండ్రోజెన్స్ అనే పురుషులకు సంబంధించిన హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. అందువల్ల అండం విడుదల కాకపోవడం, ఋతుక్రమంలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఒక్క 5 శాతం బరువు తగ్గితే చాలు అండం విడుదల సక్రమంగా జరుగుతుంది. గర్భమూ వస్తుంది."

"పెళ్లైన రెండో నెలలోనే నేను ప్రెగ్నంట్ ని అయ్యాను మేడం."

"మనిషికీ మనిషికీ తేడా వుంటుంది సిస్టర్. అందరికీ ఒకే విధంగా ఒకే టైముకి గర్భం రావాలన్న నియమమేమీ లేదు."


పీసీఓడీ సమస్య ఎంత తీవ్రంగా ఉంది? దానికి పరిష్కారాలేంటి?

"PCOD వున్నదని ఎలా తెలుస్తుందసలు?"

"యాండ్రోజెన్స్ అంటే పురుషులకు సంబంధించిన హార్మోన్ల స్థాయి ఎక్కువవుతుంది. ఈ హార్మోన్ ప్రభావం వల్ల మొటిమలు రావడం, ముఖం పై జుట్టు పెరగడం వంటి లక్షణాలు కనబడతాయి.’’

‘‘స్కానింగ్ పరీక్ష చేసినపుడు అండాశయాల్లో విడుదల కాని అండాలు చిన్ని చిన్ని నీటి బుడగల్లా కనిపిస్తూ వుంటాయి. దాదాపు పన్నెండుకు పైగా కనిపిస్తే, వాటిని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు. PCOD వున్న స్త్రీలలో 40% - 50% మంది బరువు పెరుగుతారు."

"పిల్లలు కలగరని అందరం చాలా వర్రీ అవుతున్నాం మేడం."


"PCOD అంటే సంతానం కలగని వ్యాధి కాదు. హార్మోన్ల సమతుల్యత లోపించిన ఒక స్థితి మాత్రమే. పిల్లలు కలగరనుకోవడం వట్టి అపోహ మాత్రమే!’’

‘‘బాడీ మాస్ ఇండెక్స్ ( గనక 25 కన్నా ఎక్కువ) వుంటే అప్పుడు బరువు తగ్గడం మీద దృష్టిపెట్టాలి. రోజూ వ్యాయాయం చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.’’

‘‘ముఖ్యంగా నడుము దగ్గర పెరిగిన కొవ్వు ని తగ్గిస్తే చాలా మంచి ఫలితాలుంటాయి. అండం విడుదల చక్కగా జరుగుతుంది. ఏ మందుల అవసరం లేకుండా సహజంగానే గర్భధారణ జరుగుతుంది."

"ఒకవేళ సహజంగా గర్భం రాకపోతే?"

"అండం విడుదల కోసం చికిత్స తీసుకోవాలి. మందుల ద్వారాను, తేలికపాటి సర్జరీతోనూ గర్భం వచ్చే అవకాశాలున్నాయి."

"అమ్మకేమో వారసుడు కావాలని వుంది. నాకూ మేనల్లుణ్ణి ఎత్తుకోవాలని వుంటుంది కదా."

"మాతృత్వం లాగా, నీ మేనత్తత్వాన్ని అర్థం చేసుకోగలను. పెళ్లయి పది నెలలే కదా. ఇలా వత్తిడి చేయడం వల్ల లాభం బదులు నష్టమే ఎక్కువ. ఆందోళనకు లోనైతే అండం విడుదల, ఋతుక్రమం సరిగా జరగవు. సంతానోత్పత్తి అనేది సున్నిత అంశం. వ్యక్తిగతమైనది.

‘‘విశేషమేమీ లేదా, పిల్లలింకా కలగలేదేమి’ అని వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని ప్రశ్నించడం పూర్తిగా అనాగరికం. అలా పదే పదే అడగడం వల్ల, వారిద్దరూ ఆందోళనకు, తీవ్రమైన వత్తిడికి లోనవుతారని సమాజం తెలుసుకోవాలి."

"నేను బయటిదాన్ని ఎలా అవుతాను. నా సొంత అన్నే కదా."

"భార్యాభర్తల మధ్య ఓ ప్రత్యేకమైన ప్రపంచం వుంటుంది. దగ్గర బంధువులైనా ఆ ప్రపంచంలోనికి చొచ్చుకుని వెళ్లక పోతే ఆ బంధం బలపడుతుంది. పిల్లలు కావాలా వద్దా, ఎప్పుడు కావాలి అనే విషయం నిర్ణయించుకోవాలసింది ఆ జంట మాత్రమే. నువ్వూ , నేనూ, సమాజం కాదు."

(సైంటిఫిక్ ఎలిమెంట్‌ని కథన రూపంలో చెప్పడమైనది. పాత్రలు కల్పితం. రచయిత్రి వైద్యురాలు)

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి .

No comments

Post Top Ad

Post Bottom Ad