వీకెండ్స్‌లో ఎక్కువసేపు పడుకుంటున్నారా...? ప‌్రయోజనం లేదట...!
ఉద్యోగం చేసే మహిళలు, పురుషులకు వీకెండ్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లో ఉదయాన్నే లేచి, పనులు చేసుకొని ఆఫీసుకు వెళ్లి, మళ్లీ ఇంటికి వచ్చి పని చేసుకొని ఎప్పుడో అర్థరాత్రికి నిద్రపోతారు. దీంతో సరిగ్గా నిద్ర కూడా సరిపోదు. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా అని ఎదురుచూస్తారు. ఇక వీకెండ్‌లో ఐదు రోజుల నిద్ర తీర్చుకుంటారు. ఈ నిద్రతో ఒత్తిడి, అలసట అంతా మాయమైపోద్ది అనుకుంటారు. కానీ అలా ఏం జరగదట.
నిజానికి విశ్రాంతి దొరక్కపోగా అలసట ఎక్కువవుతుందని పరిశోధకులు తెలిపారు. ఈ విషయం స్వీడన్‌లోని కరోలిన్స్‌కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు జరిపిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. వారాంతాల్లో అధిక సమయం పాటు నిద్రపోవడం వల్ల శరీర క్రమగతి తప్పుతుందట. ప్రతిరోజూ నిద్ర షెడ్యూల్ ఎలా ఉంటుందో వీకెండ్స్‌లో కూడా అలానే నిద్రపోవడం మంచిదంటున్నారు. తెలుసుకున్నారుగా. కాసేపు పడుకుంటే ఏం కాదు. అదే పనిగా పడుకుంటే ఇలానే జరుగుతుంది. ఇప్పుడైనా కాస్త జాగ్రత్త వహించండి.
దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి.
No comments