Header Ads

బ్రా తీసేసి పడక మీదికి వెళ్లండి: కారణాలు ఇవీ...

బ్రాను తీసేయకుండా రాత్రి వేళ నిద్రపోతే రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బిగుతైన బ్రా వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగదని అంటున్నారు.

రాత్రి పడక మీదికి వెళ్లినప్పుడు బ్రా ధరించకూడదని చాలా మంది మహిళలకు తెలియదు. బ్రా ధరించి నిద్రపోతే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు వారికి తెలియవు. బ్రాను తీసేయకుండా నిద్ర పోతే ఆరోగ్య సమస్యలు ఎదురువతాయని గైనకాలిజిస్టులు చెబుతున్నారు.
 
బ్రా తీసేసి పడక మీదికి వెళ్లండి: కారణాలు ఇవీ... | Five reasons why you  should not wear a bra to bed

బ్రాను తీసేయకుండా రాత్రి వేళ నిద్రపోతే రక్తప్రసరణపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బిగుతైన బ్రా వల్ల రక్తప్రసరణ సాఫీగా సాగదని అంటున్నారు.

బ్రా ధరించి నిద్రపోతే రక్తనాళాలు బిగుసుకుపోయి ప్రసరణ సరిగా జరగదు. దాని వల్ల వక్షోజాలు దెబ్బ తింటాయి. నరాలు బిగుతుగా మారి వక్షోజాలు ఇబ్బందికి గురి చేస్తాయి.

బ్రా ధరించి నిద్ర పోతే ఎలాస్టిక్ పార్ట్ వల్ల పిగ్మింటేషన్ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే చర్మం రంగు మారుతుంది. చర్మ సమస్యలు ఉత్పన్నమవుతాయి.

అంతే కాకుండా, బ్రా తీసేయకుండా నిద్రపోతే అసౌకర్యంగా కూడా ఉంటుంది. నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. గాఢ నిద్ర పోలేరు. అది శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.  

చాలా మంది మహిళలు బిగుతైన బ్రా మంచిదని భావిస్తారు. అత్యంత బిగువైన బ్రా వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని హర్వార్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో తేలింది 

No comments

Post Top Ad

Post Bottom Ad