మెరిసే చర్మం కోసం ఈ అయిదు చిట్కాలు పాటించండి!
వయసుతో సంబంధం లేకుండా అమ్మాయిలు కోరుకునేది ప్రకాశించే చర్మం. అయితే, చర్మాన్ని కాంతివంతం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ, ఈ 5 సాధారణ చిట్కాలు పాటించండి, మీరు కలలుగన్న సౌందర్యవంతమయిన చర్మం సులువుగా పొందవచ్చు.
1 . ఖచ్చితమయిన ఆహరం తీసుకోవడం:
ఆరోగ్యకరమైన పనితీరు కోసం మీరు శరీరానికి ఆహారం అందించినట్లే, మీ చర్మం కోసం కూడా అదే చేయవలసి ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, కూరగాయలు మరియు పండ్లు సమృద్ధిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. ఇది బెర్రీలు, గింజలు, తక్కువ ప్రోటీన్లు మరియు ఆకుకూరలతో చేయవచ్చు. ఇవి లోపలి నుండి మీ చర్మాన్ని మరమ్మత్తు చేయడానికి ఉపయోగపడతాయి.
2 . ముందుగా మొదలెట్టండి:
చర్మ సంరక్షణ నియమావళి పాటించడానికి ఎక్కువ సమయం తీసుకోకండి. మీరు యవ్వనంలోకి అడుగిడినప్పటినుండే- చర్మాన్ని శుభ్రపరచడం, మాయిశ్చరైజ్ చేయడం మరియు జాగ్రత్త వహించడం మొదలుపెట్టండి.
3.చెమట పట్టించండి:
వ్యాయామం మీ శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా అద్భుతాలు చేస్తుంది! మీ గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల రక్త ప్రసరణ జరిగి, తద్వారా టాక్సిన్స్ (వ్యాధి క్రిములు పుట్టించు విషము) విసర్జన జరిగేందుకు సహాయపడుతుంది. వ్యాయామం తర్వాత మీ ముఖం ప్రకాశవంతంగా మారడానికి కారణం ఇదే.
4 . మంచి నిద్ర:
ఆలస్యంగా నిద్ర పోవడం దీర్ఘ కాలంలో దుష్ప్రయోజనాలు కలిగిస్తుంది. నిద్ర లేమి మీ ముఖం మీద రక్త నాళాలను బిగుతుగా చేస్తుంది. నిద్ర వాస్తవానికి చర్మానికి అత్యంత అవసరమయిన కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. సో, త్వరగా నిద్రకు ఉపక్రమించే ప్రయత్నం చేయండి.
5 . చర్మానికి కాస్త విశ్రాంతి ఇవ్వండి:
మీరు రోజువారీ మేకప్పు ఉపయోగించే వారయితే, చర్మ సంరక్షణ కోసం ఒక రోజు పక్కన పెట్టండి. మీ చర్మం ఒక స్పాంజ్ వలె ఉంటుంది మరియు మీరు ఉపయోగించిన ప్రాడక్టు యొక్క ప్రతి పొరను అది వేగంగా గ్రహిస్తుంది. కాబట్టి, మీరు మీ చర్మానికి మేకప్ వేయకుండా విశ్రాంతి ఇస్తే చర్మ రంధ్రాలను మరియు కణాలను ఫ్రీ చేస్తుంది.
No comments