Header Ads

యోని గురించి తెలుసుకోవాల్సిన అయిదు ముఖ్యమైన విషయాలు

యోని గురించి సోషల్ మీడియాలో చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని సరిదిద్దడం కోసం ఓ మహిళ నిరంతరం కృషి చేస్తున్నారు. ఆమే డాక్టర్ జెన్ గంటెర్. ఆమె 25 ఏళ్లుగా అమెరికా, కెనడా దేశాల్లో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు.

Chloe Dykstra on Twitter: "The Assassin's Creed logo looks like an  upside-down ASL hand sign for vagina. http://t.co/T9pD5M0pj4"

మహిళల ఆరోగ్య సంరక్షణపై ట్విటర్‌లో సలహాలిచ్చే గైనకాలజిస్ట్‌గా ఆమె పేరు తెచ్చుకున్నారు.

జెయిడ్ ఎగ్స్ (యోనిలో పట్టేవిధంగా గుడ్డు ఆకారంలో సానబెట్టిన రాయి. వీటినే యోని గుడ్లు, లవ్ ఎగ్స్ అని కూడా అంటారు)ను యోనిలో పెట్టడం వల్ల ''హార్మోన్ల సమతుల్యం, సక్రమంగా రుతుస్రావం, మూత్రాశయ నియంత్రణ''కు సహాయపడుతుందనే వాదనలు ఉన్నాయి. అయితే, వీటిని ఆమె ఖండించారు. ఈ వాదనలు ప్రాచీన చైనీస్ సంప్రదాయంలో లేవని, శాస్త్రీయంగా నిరూపితం కూడా కాలేదని వివరించారు. దీంతో ఇలాంటి అపోహలకు అడ్డుకట్ట పడినట్లయింది.

డాక్టర్ గంటెర్ తాజా పుస్తకం 'ది వజైనా బైబిల్' అనేక దేశాల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకంగా నిలిచింది. యోని గురించి ఇందులో చాలా ఆచరణాత్మకమైన సలహాలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో మహిళలకు మరింత అవగాహన కల్పించేందుకు ఈ పుస్తకం సహాయపడుతుంది. రచయిత దృష్టిలో యోని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని భావిస్తున్న కొన్ని వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి.


యోని

1. దేనిని ఏమంటారో తెలుసుకోవడం ముఖ్యం

యోని శరీరం లోపల ఉంటుంది. దీన్ని గర్భాశయాన్ని బయటి శరీరానికి కలిపే కండరాల సముదాయమని అనొచ్చు.

ఇక మీరు బయటి నుంచి చూడగలిగేది, బట్టలను తాకుతూ ఉండే భాగాన్ని వల్వా (జననాంగం) అంటారు.

ఇలాంటి విషయాల్లో సరైన పరిభాషను తెలుసుకోవడం చాలా కీలకమని గంటెర్ చెబుతుంటారు.

వల్వా బయటి భాగాన్ని వైద్య పరిభాషలో 'ప్యుడెండా'గా పిలుస్తారు. ఇది 'ప్యుడెట్' అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లాటిన్‌లో ప్యుడెట్ అంటే 'ఇది సిగ్గుపడుతుంది' అని అర్థం.

అయితే, ఇలాంటి పరిభాషను ఉపయోగించడం భావోద్వేగ స్థాయిలో మహిళలకు హానికరం కాదని గంటెర్ భావన.

కానీ, వైద్యపరంగా చూస్తే ఇలా చేయడం మహిళలపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే రోగులు తమకు ఏం జరుగుతుందో సరిగ్గా వివరించలేకపోవచ్చు, సరైన చికిత్స పొందలేకపోవచ్చు.

2. యోని తనకు తాను శుభ్రమవుతుంది

గత 10 ఏళ్లలో మహిళల వైఖరిలో మార్పును గమనించానని గంటెర్ చెబుతున్నారు. చాలామంది మహిళలు యోని నుంచి వచ్చే వాసనను పోగొట్టడానికి ఉత్పత్తులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నమ్ముతున్నట్లు ఆమె చెప్పారు.

గత ఏడాది ఉత్తర అమెరికాలో 57 శాతం మంది మహిళలు యోనిని శుభ్రపరుచుకున్నారని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు.

అయితే, యోని లోపల శుభ్రం చేయడానికి దేనినీ ఉపయోగించాల్సిన అవసరం లేదని గంటెర్ చెప్పారు.

''యోని తనకు తానుగా శుభ్రమవుతుంది' అని ఆమె వివరించారు. ముఖ్యంగా సువాసన వెదజల్లే ఉత్పత్తులతో యోనిని శుభ్రం చేయడం తగదని హెచ్చరించారు.

''ఇది యోని, పినా కోలాడా (రమ్, కొబ్బరి పాలు లేదా పైనాపిల్ జ్యూస్‌తో చేసే కాక్‌టైల్) కాదు'' అని ఆమె చెప్పారు. యోనిని కడిగే సువాసనభరిత ఉత్పత్తులు సిగరెట్లలాంటివని అన్నారు.

నీరు కూడా సున్నితమైన వ్యవస్థను దెబ్బతీస్తుంది. లైంగిక అంటువ్యాధుల సంక్రమణను పెంచుతుంది.

ఇక ఆవిరి పట్టడం మరో ధోరణి, ఇది అనవసరం. ఇలా చేయడం వల్ల సున్నితమైన భాగాలు కాలే ప్రమాదం ఉంది.

అవసరం అనుకుంటే జననేంద్రియాల వెలుపలి ప్రాంతాన్ని నీటితో సున్నితంగా శుభ్రం చేయొచ్చు.

మనం వాడే సబ్బు చర్మం లోపలకి నీరు చేరకుండా వాటర్ ఫ్రూఫ్‌గా మారి ఆమ్లత్వాన్ని తొలగిస్తుంది.

ఒకవేళ బహిష్టు సమయంలో హార్మోన్ల మార్పులు వల్ల యోని భాగంలో పొడిగా, అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే మాత్రం కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వంటివి వాడటం మంచిది.

ప్రతి 96 గంటలకు ఒకసారి యోని కణాల పునరుత్పత్తి జరుగుతుంది. చర్మంలోని ఇతర భాగాల కంటే చాలా వేగంగా ఇక్కడ పునరుత్పత్తి జరగుతుంది.

యోనికి సంబంధించి తెలుసుకోవాల్సిన మఖ్యవిషయాలు

3. ఒక తోటలాంటిది

యోనిలో మంచి బ్యాక్టీరియా సైన్యం ఉంది. ఇది ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

''యోని ఒక సూక్ష్మజీవుల తోటలాంటిది. ఇది యోని వ్యవస్థ ఆరోగ్యంగా ఉంచడానికి కలసి పనిచేసే అన్ని రకాల బ్యాక్టీరియాలకు తోటలా ఉంటుంది'' అని గంటెర్ చెప్పారు.

మంచి బ్యాక్టీరియా కొంచెం ఆమ్ల వాతావరణాన్ని సృష్టించే పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది 'చెడు' బ్యాక్టీరియా పట్టుకోవడాన్ని ఆపివేస్తుంది.

అందువల్ల యాంటీ బాక్టీరియల్ ఉత్పత్తులతో యోనిని తుడవడం మంచిది కాదు. ఎందుకంటే, బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడం ముఖ్యం. అదేవిధంగా, చర్మం తేమగా ఉండే వల్వాలో హెయిర్ డ్రయ్యర్ వాడకూడదని గంటెర్ సలహా ఇచ్చారు.

వాక్సింగ్

4. జననేంద్రియాల్లో వెంట్రుకలకు కారణముంది

జననేంద్రియాల వద్ద ఉన్న వెంటుకలను తొలగించే ధోరణి మహిళల్లో ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల పేలు లేకుండా పోతాయి. కానీ, దీనివల్ల ప్రమాదం ఉందని గంటెర్ పేర్కొన్నారు.

''మీరు షేవింగ్ చేయడం లేదా వాక్స్ చేయడం అంటే మీ చర్మానికి సూక్ష్మంగా గాయం చేస్తున్నారని అర్థం. ఇలా చేస్తున్నప్పుడు గాయాలవడం, తెగడం, ఇన్ఫెక్షన్స్ రావడం మనం చూస్తాం'' అని గంటెర్ తెలిపారు.

రేజర్‌తో షేవింగ్ చేస్తున్నప్పుడు వెంట్రుకలు పెరిగే దిశలోనే షేవింగ్ చేయాలని సూచిస్తున్నారు.

''జననేంద్రియాల వద్ద వెంట్రుకలు మొలకెత్తడం నిరంతరం జరిగే చర్య. చర్మానికి రక్షణగా ఉండేందుకే ఈ ఏర్పాటు. లైంగిక వ్యవస్థలో ఇది కూడా భాగంగా ఉండొచ్చు' అని ఆమె తెలిపారు.

5. పెరిగే వయసు యోనిపై ప్రభావం చూపుతుంది

దీర్ఘకాలంగా రుతుస్రావం, పిల్లలు కలగడం వల్ల కొన్నాళ్లకు అండాశయాల ఉత్పత్తి ఆగిపోతుంది. బహిష్టు కూడా ఆగిపోతుంది.

మహిళల్లో సంతానం కలగుండా హార్మోన్ల మార్పు జరుగుతుంది. ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గి, ముఖ్యంగా యోని, వల్వాలపై ప్రభావం పడుతుంది.

ఒకప్పుడు తేమగా ఉండే కణజాలాలు క్షీణించిపోయి పొడిబారుతాయి. దీని వల్ల సెక్స్ సమయంలో నొప్పి వస్తుంది.

ఇది నిరుత్సాహకరంగా అనిపించవచ్చు. కానీ, ఇలాంటి సమయంలో చాలా మంది మహిళలు డాక్టర్ సహాయం పొందవచ్చని డాక్టర్ గంటెర్ సూచించారు.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి .

No comments

Post Top Ad

Post Bottom Ad