Header Ads

అమ్మాయిల‌ను ప‌డ‌గొట్టడానికి మీలో ఈ 10 క్వాలిటిస్ ఉంటే చాలట…

అమ్మాయిలు స‌హ‌జంగా ఎలాంటి అబ్బాయిల‌ను లైక్ చేస్తారు ? అనే అంశంపై చాలా ప‌రిశోధ‌న‌ల్లో ర‌క‌ర‌కాల ఫ‌లితాలు వ‌చ్చాయి. కొంత‌మంది అమ్మాయిలు మృదుస్వ‌భావులు అయిన అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తార‌ని అంటే మ‌రికొంద‌రు మాత్రం స్టైలీష్‌గా ఉండే అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డ‌తార‌ని చెపుతుంటారు.


Things Super-Happy Couples Talk About - Orange County Relationship Center 

ఎవ‌రి ఆలోచ‌న‌లు ఎలా ఉన్నా ఓవ‌రాల్‌గా మాత్రం ఈ క్రింద 10 క్వాలిటీస్ ఉన్న అబ్బాయిల‌ను అమ్మాయిలు ఎక్కువుగా ఇష్ట‌ప‌డ‌తార‌ని ఓ తాజా సర్వేలో స్ప‌ష్ట‌మైంది.

మ‌రి ఆ 10 క్వాలిటీస్ ఏంటో చూద్దాం.

  1. అబ్బాయిలు చాలా ధైర్యం కలిగి ఉండాలట. ఎప్పుడైనా పని ఏదైనాసరే సింహమంత ధైర్యంతో చేయగలగాలట.
  2. అబ్బాయిలు తమజీవితంలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్త పాటించేవారై ఉండాలి. ముఖ్యంగా తన జీవిత భాగస్వామి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త వహించాలి.
  3. ఉదయాన్నే నిద్రలేచే వ్యక్తి ఇతరులను కూడా ప్రోత్సహిస్తాడు. అందుకే అబ్బాయిల్లో ఉదయమే నిద్రలేచే అలవాటు ఉండాలి.
  4. కష్టమైన పని వచ్చినప్పుడు అది కష్టమని భావించకుండా, నటన చూపించకుండా, భయపడకుండా హార్డ్‌ వర్క్‌ చేసే వారిని అమ్మాయిలు బాగా ఇష్ట‌ప‌డ‌తార‌ట‌.
  5. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌… ఈ రెంటినీ గౌరవించే వ్యక్తి అయి ఉండాలి.
  6. భాగస్వామి అవసరాలు తెలుసుకోవాలి. వాళ్ళ కోరికలు తెలుసుకుని నెరవేర్చడానికి ప్రయత్నించేవాడై ఉండాలి. తన భాగస్వామిని అమితంగా ప్రేమించేవాడై ఉండాలి.
  7. తన రిలేషన, వ్యక్తిగత వర్క్‌లైఫ్‌ అన్నింటి వల్ల వచ్చే అపాయాల రిస్క్‌ని అర్థం చేసుకోగలిగే వ్యక్తి అయి ఉండాలి. ప్రేమ విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడగలిగేటట్టు ఉండాలి.
  8. తమ భాగస్వామితో గడిపిన స్వీట్‌ మెమరీస్‌, ఇష్టమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుగా ఉండాలి.
  9. అమ్మాయి వ‌ద్ద నిజాయితీగా ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా భరోసా ఇచ్చేలా ఉండాలి.
  10. చేసే పనిలో శ్రద్ధ ఉన్న అబ్బాయైు ఉండాలి. ఒక లక్ష్యంతో పనిచేయగలిగే లక్షణం కలిగి ఉండే అబ్బాయి కావాలని అమ్మాయిలు కోరుకుంటున్నారట.

మ‌రి ఈ 10 క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.

దయచేసి షేర్ చేసి అందరికి తెలియచెయ్యండి .

No comments

Post Top Ad

Post Bottom Ad