నల్ల జుట్టు పొందుటకు ఉత్తమమైన సహజ ఇంటి చిట్కాలు
సాధారణంగా మన జుట్టు వయస్సు పెరిగే కొద్దీ , రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అంతేకాకుండా, జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల సైతం ఈ ఇబ్బంది కలుగవచ్చు.జుట్టు నల్లగా ఉంటేనే అందం. జుట్టు తెల్లబడడం మొదలు పెడితే నేటి యువత మానసికంగా కృంగిపోతున్నారు. మన జుట్టు రంగు చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. మన వెంట్రుకల క్రిందిభాగంలో ఉండే మెలానో సైట్స్ అనే కణాలు జుట్టుకి రంగునిస్తాయి. మన శరీరంలోని మెలానిన్ స్థాయిని బట్టి చర్మం మరియు జుట్టు రంగులు ఏర్పడతాయి.
వయసు పైబడుతున్నప్పుడు మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోయి క్రమంగా ఆగిపోతుంది. ఫలితంగా జుట్టు తెల్లబడుతుంది. వయసు వల్ల నెరసిన జుట్టు ఇక నల్లబడదు. కొన్ని సహజమైన చిట్కాలను పాటించడం వలన మీరు మళ్ళి నల్లని జుట్టుని పొందవచ్చు. ఇంటి చిట్కాల వలన చిన్నతనంలో వచ్చే తెల్లని జుట్టుని నివారించి చాల వొతైన బలమైన జుట్టుని పొందవచ్చు. బయట మార్కెట్లో లభించే హెయిర్ బ్లాక్ కలర్ ప్రొడక్ట్స్ వాడటం వలన జుట్టు బలహీనంగా తయారు అవుతుంది. అందువలన ఇంటి చిట్కాలు ఉపయోగించడం వలన మీ జుట్టు చాల వొత్తుగా నల్లగా అందంగా తయరుఅవుతుంది.
1 ) ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి, కాచిన తర్వాత ఆ నీటిని చల్లార్చి గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని కుదుళ్ళలోకి ఇంకేలా రోజూ రాస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.
2 ) అరకప్పు ఆలివ్ ఆయిల్ ను బాగా వేడి చేసి అందులో కొన్ని చుక్కల రోజ్ మెరీ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు లోపలి దాకా పట్టించి అరగంట పాటు అలాగే వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. తలస్నానం చేసే ప్రతి సారి ఈ విధంగా చేసినట్టయితే జుత్తుకు రంగు వేసుకోవల్సిన అవసరం దాదాపు రాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆలివ్ ఆయిల్ మరియు రోజ్ మెరీ ఆయిల్ జుట్టు సహజరంగను సంరక్షించడంతో పాటు జుట్టు పొడవుగా పెరగడానికి దోహదం చేస్తాయి.
3) అర లీటరు నీటిలోకి ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పొడిని మరియు నిమ్మరసాన్ని (సగం నిమ్మ ముక్క) కలపాలి. తలస్నానం చేసే ముందు ఆ నీటిని తలకు అప్లై చేయడం వలన మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
4) 1 కేజీ నెయ్యిని తీసుకొని దానిలో 150 గ్రాముల తేనే, 1 లీటర్ ఉసిరి రసాన్ని కలిపి బాగా వేడిచేయాలి. దానిలోని నీరు అంతా ఆవిరైపోయే అంత వరుకు వేడి చేస్తూనే ఉండాలి. ఆ ద్రావణం తయారు అయిన తరువాత ఒక గాజు సీసలోకి తీసుకోవాలి. దానిని తలస్నానం చేసే ముందు తలకి రాసుకోవాలి. ఇలా చేయడం వలన మీరు మళ్ళి నల్ల జుట్టుని పొందే అవకాశం ఉంది.
5) కొన్ని మామిడి ఆకులను తీసుకొని వాటిని పేస్టుచేసి జుట్టుకి అప్లై చేసి 15-20 నిమిషముల తరువాత మంచి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వలన మీకు జుట్టు తొందరగా పెరుగుతుంది అలానే నల్లగా కూడా అవుతుంది.
6) కొన్ని మామిడి ఆకులను మరియు కొన్ని పచ్చిమామిడి తొక్కలను తీసుకొని కలిపి వాటిని ఆయిల్లో వేసి చాల కాలం వరకు సూర్యరశ్మి తగిలేల ఎండలో ఉంచాలి. ఆ ఆయిల్ రాసుకోవడం వలన జుట్టు రాలటాన్ని ఆపి నల్ల జుట్టు వచ్చేలా చేస్తుంది.
7) జామ ఆకులు మెత్తగా పేస్ట్ చేసి తలకు పట్టించి 15నిముషాల తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు నల్లగా నిగనిగలాడుతుంటుంది.
8) మామిడి విత్తనం యొక్క నూనెను వాడటం వలన తెల్లజుట్టు నల్లజుట్టుగా మారుతుంది. అలానే జుట్టు రాలటాన్ని ఆపి, చుండ్రు రాకుండా చేస్తుంది.
9) మందార ఆకుల చిట్కా అందరికీ తెలసిందే. మందార ఆకులను మెత్తగా పేస్ట్ చేసి తలకి పట్టించి, ఆతర్వాత తలస్నానం చేయాలి. ఈ విధంగా కొన్ని వారాల పాటు చేసినట్లైతే మంచి ఫలితాన్ని పొందవచ్చు. మందార ఆకులు వేడిని తగ్గించడంతో పాటు జుట్టు రంగును కాపాడుతాయి. జుట్టు పొడవుగా పెరగడానికి కూడా దోహదం చేస్తాయి.