మీ సంబంధం యొక్క భవిష్యత్తును నిర్ణయించే కొన్ని విషయాలు
ఒక సంబంధం యొక్క భవిష్యత్తును నిర్ణయించడానికి, కొన్ని ప్రాథమిక విషయాలను గమనించాల్సి ఉంటుంది. సంబంధం స్థితి నుండి సంబంధ లక్ష్యం వరకు, మీరు ఒక విలువైన సంబంధాన్ని పరిరక్షించడం కొరకు ప్రయత్నిస్తున్న సమయంలో అనేక విషయాలనులను పాటించాల్సి ఉంటుంది. ఒక సంబంధం యొక్క భవిష్యత్తును నిర్ణయించుటకు ఐదు అత్యంత ముఖ్యమైన విషయాలను పరిగణించాలి.
భవిష్యత్ లక్ష్యాలు
మీ యొక్క సొంత భవిష్యత్ లక్ష్యాలు మీకు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే ఒక సంబంధం యొక్క భవిష్యత్తు నిర్ణయించవచ్చు. ఇద్దరి వ్యక్తుల మధ్య వారి వారి అవసరాలు మరియు కోరికలు సమానంగా తెలిసి ఉన్నపుడు అక్కడ ఒక చక్కటి సంబంధం ఏర్పడుతుంది. మీరు మీ జీవితం నుండి ఖచ్చితంగా ఏమనుకుంటున్నారు? ఇప్పటి నుండి అయిదు సంవత్సరాల వరకు మిమ్మల్ని మీరు చూసుకోగలరా? భవిష్యత్ లక్ష్యాలు కలిగి ఉండటం చాలా ముఖ్యం మరియు అప్పుడు మాత్రమే ఒక సంబంధం నుండి మీరు మీ యొక్క కోరికలను మరియు అవసరాలను అర్థం చేసుకోగలుగుతారు. మీ యొక్క వివాహంను మీరే ఉహించుకోగలరా? లేదా మీరు ఆలస్యంగా వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారా? వీటి గురించి ఒకసారి ఆలోచించండి.
ఉద్వేగ సమీకరణ
సరైన భావోద్వేగ సమీకరణల ఆధారంగానే ఒక చక్కటి సంబంధం ఏర్పడుతుంది. మీ మరియు మీ భాగస్వామి యొక్క మానసికత సమానమని ఏవిధంగా చెప్పగలరు. ఒకరినొకరి ఆందోళనలు మరియు భయాలను అర్ధం చేసుకోగలరా? కఠిన సమయాలలో ఒకరికొకరు సహాయం చేసుకుంటారా? భాగస్వాములు ఒకరికొకరి అభిరుచులను సమర్ధించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు గౌరవం మరియు అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఒక చక్కటి సంబంధం ఏర్పడుతుంది. భాగస్వాములిద్దరూ మానసికంగా సమర్ధించుకున్నపుడు మాత్రమే సంబంధాలు వికసిస్తాయి.
ఉద్వేగత్మకమైన సాన్నిహిత్యం
దంపతులు విడిపోవడానికి గల ప్రధాన కారకం వారి మధ్య సాన్నిహిత్యం లేకపోవడం మరియు దీనిని ప్రారంభంలోనే సరి చేయవచ్చు. ప్రేమంటే కేవలం ఒక వ్యక్తిని ఇష్టపడటమే అని చాలా మంది భావిస్తుంటారు, కానీ ఒక గొప్ప సాన్నిహిత్య సామర్థ్య సంబంధం కలిగి ఉండడమంటే వారి మధ్య ఏదో ఒక ఉద్వేగాత్మకమైన విషయం ఉన్నట్టే, ఇది ఒక సరిపోలని భావన. కాబట్టి మీరు ఒక మంచి సాన్నిహిత్యమైన భాగస్వామి కలిగి ఉన్నప్పుడు, కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సాన్నిహిత్యంపై అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంటుంది. మీరు మీ యొక్క ప్రత్యేకమైన వ్యక్తిని చూసినపుడు మీ హృదయం కరిగినటువంటి భావన కలిగిందో గ్రహించడానికి ప్రయత్నించండి మరియు ఒకవేళ అలానే అన్పించినట్లయితే, అప్పుడు మీరు అతనిని లేదా ఆమెను కలిగి ఉండడం అదృష్టంగా భావించండి.
మీ భాగస్వామి పట్ల నిజాయితీని కలిగి ఉండడం
మనం నిజాయితీగా ఉండటమంటే అదోక సుగుణం మరియు దానికి సంబంధించి మరో రెండో మార్గం లేదు. మీరు మరియు మీ భాగస్వామి ఒకరికొకరి పట్ల నిజాయితీని కలిగి ఉన్నప్పుడు అక్కడ సంపూర్ణమైన పారదర్శకత ఏర్పడి నమ్మకం బలపడుతుంది. ఒక మోసపూరితమైన సంబంధం ఎల్లప్పుడూ నమ్మకపూరితమైన అంశాలను అడ్డుకుంటుంది మరియు ఇద్దరి మధ్య అనేక సమస్యలు ఏర్పడుతాయి. ఇద్దరు వ్యక్తులు ఒకరి పట్ల మరోకరు పారదర్శకంగా మరియు నిజాయితీగా ఉన్నట్లయితే, అక్కడ ఎటువంటి సమస్యలు ఏర్పడవు. చెప్పనవసరం లేని మరో విషయం, ఈ విషయంలో అబద్దాలు ఎపుడూ కఠినమైన స్థితిని ఏర్పరచవచ్చు. మీరు అన్ని సమయాల్లోను కఠోరమైన నిజాయితీని కలిగి ఉండాలి. తద్వారా ఒక మంచి సంబంధానికి పునాదులు వేయవచ్చు.
సంతోషం
మీ సంబంధం మీకు సంతోషాన్ని అందిస్తుందో లేదో అర్థం చేసుకోవడం అనేది ఒక ప్రాథమిక విషయంగా గుర్తించండి. ఒక పరిపూర్ణ సంబంధం మీకు సంతోషాన్ని అందిస్తుంది మరియు మీరు మీ జీవితంలో సంతోషం కన్నా దుఃఖాన్నే ఎక్కువగా అనుభవిస్తున్నట్లయితే, అది పునరాలోచించుకోవలసిన సమయంలో ఒకటి. ఒక సంబంధం ఏర్పడటం మరింత కఠినంగా మారినట్లయితే, ఆ విధంగా కఠినంగా కృషి చేసినప్పటికీ మీలో ఆనందం కలుగనట్లయితే, అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాల్సిన సరియైన సంబంధం కాదు. సంతోషం అనేది ఒక మంచి సాన్నిహిత్య సంబంధంలో కీలక విషయం మరియు సంతోషం లేనట్లయితే ఆ సంబంధం యొక్క భవిష్యత్తు విషాదభరితంగా ఉంటుంది.