Header Ads

పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు? భార్యలా? భర్తలా?

సంతాన లేమి…ఇప్పుడు ఈ సమస్య చాలా మంది దంపతులను వేధిస్తున్న సమస్య, పెళ్ళై అయిదేళ్లు దాటినా..ఇంకా పిల్లలేరని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే.  ఇదే సమయంలో కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి అవకాశాలు పుట్టుకొచ్చాయి.  అమ్మ అవ్వలాని ఏ స్త్రీ కోరుకోదు చెప్పండి. పిల్లల్ని కనాలని, తమ చేతులతో ఆడించాలని ఏ తల్లి కోరుకోదు చెప్పండి. ఎందరో స్త్రీలకు  అమ్మ తనాన్ని దూరం చేస్తున్న ఈ సమస్య గురించి కాస్త లోతుగా చర్చించుకుందాం.
Happy Couple Images Free Download Clip Art - WebComicms.Net
పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు?
  • ఆడవారు 33%,
  • మగవారు 33%
  • ఇతర కారణాలు 34%
గర్భం దాల్చే అవకాశాలు:
  • పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50%.
  • ఏడాదిలోపైతే 75%
  • రెండేళ్లలో 85 నుంచి 90 శాతం
మగవారిలో వంధత్వానికి కారణాలు
  1. పొగతాగడం, మద్యం సేవించడం.
  2. గతుకుల రోడ్డు మీద వాహనాలను ఎక్కువగా నడపడం.
  3. వృషణాలకు వేడి తీవ్రత ఎక్కువగా గురయ్యే పరిశ్రమల్లో పనిచేయడం.
  4. వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా చికిత్స అయి ఉండడం.
  5. గవద బిళ్లలు, సుఖరోగాల ఉండడం
ఆడవారిలో కారణాలు:
  1. వయస్సు… 18-36 వయస్సులో ఉన్న వారికి గర్భాన్ని దాల్చడానికి అనువైన వయస్సు.
  2. 18 లోపు & 34 దాటిన వారికి అండాశయ సమస్యలు ఎక్కువ.
  3. ఫెలోపియన్‌ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు
  4. క్రమరహిత రుతుస్రావం
  5. పెల్‌విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌
  6. టి.బి (క్షయ) వంటి రోగాలు
  7. పొగ తాగడం, మద్యం సేవించడం.
  8. అండాశయ సమస్యలు.

Post Top Ad

Post Bottom Ad