పాదాల పగుళ్లను మాయం చేసే మిరాకిల్ 10 హోం రెమెడీస్
స్త్రీ, పురుషులిద్దరిలో కనిపించే ఒక కామన్ ప్రాబ్లెమ్ క్రాక్డ్ హీల్స్(కాళ్ళ పగుళ్లు). ఇది ఒక కాస్మోటిక్ సమస్య. పాదాలు పగుళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. అంతే కాదు పాదాలు నొప్పికి కూడా కారణం పాదాల పగుళ్ళే.. పాదాల పగుళ్లు ఏర్పడినప్పుడు పాదాల చుట్టు చీలినట్లు, చర్మం పైకి పీక్కుపోయినట్లుగా చాలా ఇబ్బందికరంగా కనబడుతుంటుంది. హీల్ వద్ద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితిలో పాదాల మీద కాస్త ఒత్తిడి పడితే చాలు..పాదాలు నొప్పిగా, ఇన్ఫ్లమేషన్ తో రెడ్ గా కనబడుతంటాయి. పాదాల పగుళ్లుకు కారణమేదైనా కావచ్చు, కానీ అటువంటి పగిళిన పాదాలను చూడటానికి చాలా అసహ్యంగా ...అన్ హైజీనిక్ గా కనబడుతుంటాయి.
కొన్ని సందర్భాల్లో పగిలిన పదాల మీద డస్ట్ చేరడం వల్ల ఆ పాదాలను చూడటానికి మరింత మురికిగా, అసహ్యంగా కనబడుతాయి . ఫ్లాట్ స్లిప్పర్స్ , సాండిల్ వేసుకున్నప్పుడు పాదాలు మరింత స్పష్టంగా కనబడుతుంటాయి. దాంతో పాదాల పగుళ్లు మరింత స్పష్టంగా కనబడుతుంటాయి. ఇలా పాదాలపగుళ్లు ఏర్పడినప్పుడు, పగుళ్లు కనబడకుండా దాచిపెట్టడానికి షూ ధరించడం కూడా సాధ్యం కాదు. కాబట్టి, హీల్స్ వైప్ పైవరకూ క్లోజ్డ్ గా ఉండే షూష్ మాత్రమే ధరించాలి. లేదంటే పగుళ్ల నుండి రక్తస్రావం కావచ్చు, ఇలాంటి సమయంలో మెడికల్ హెల్ప్ చాలా అవసరమవుతుంది ఇలా పాదాలు అన్ హైజీనిక్ గా కనబడినప్పుడు నలుగురిలో ఇబ్బంది మరియు కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతాయి. ఇలాంటి సమస్య ఎదురుకాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
పాదాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల పాదాల పగుళ్ల ను తగ్గించుకోచ్చు. తర్వాత మీకు నచ్చిన బెస్ట్ సాండిల్స్ వేసుకోవచ్చు. అయితే పాదాల పగుళ్ళు ప్రారంభంలో ఉన్నప్పుడు హోం రెమెడీస్ సహాయపడుతాయి. అలాగే ఈ హోం రెమెడీస్ అన్నీ కూడా ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. పాదాల పగుళ్లను తగ్గించుకోవడం కోసం కాస్లీ ఆయిట్ మెంట్స్, ట్రీట్మెంట్ అవసరం లేకుండా ఈ హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. అవేంటో తెలుసుకుందాం..
పాదాల పగుళ్లను మాయం చేసే మిరాకిల్ 10 హోం రెమెడీస్ 1/10
1. నిమ్మరసం సాల్ట్ స్ర్కబ్ : గోరువెచ్చని నీటిలో పాదాలను డిప్ చేసి కొద్ది సేపటి తర్వాత సాల్ట్ లో డిప్ చేసిన నిమ్మతొక్కతో పాదాలను స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ , ఇతర ఇన్ఫెక్షన్స్ తొలగిపోయి అందంగా కనబడుతాయి.
2. రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ : రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ రెండూ మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు పాదాలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సాఫ్ట్ గా మారుతాయి. రెగ్యులర్ గా ఉపయోగిస్తే మరీ మంచిది.
3. వెజిటేబుల్ ఆయిల్ : పగిలిన పాదాలకు వెజిటేబుల్ ఆయిల్ ను అప్లై చేయాలి. ఆలివ్ ఆయిల్, కోకనట్ ఆయిల్ మరియు బాదం ఆయిల్ వీటిలో ఏవైనా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆయిల్ పాదాల పగుళ్లలోపలికి వేళ్ళి పగుళ్లను నయం చేయడానికి సహాయపడుతాయి. తగిన మాయిశ్చరైజింగ్ ను అందిస్తాయి.
4. పెట్రోలియం జెల్లీ: రాత్రి పడుకునే ముందు పగిలిన పాదాలకు పెట్రోలియం జెల్లీ అప్లై చేసి, సాక్సులు వేసుకుని పడుకోవాలి. జెల్లీ బాగా పనిచేస్తుంది.
5. ఫ్రూట్ మాస్క్: బొప్పాయి మరియు అవొకాడో ను మెత్తగా పేస్ట్ చేసి పాదాలకు అప్లై చేయాలి. ఇది డ్రై స్కిన్ ను నివారించడంతో పాటు పగుళ్ళను కూడా మాయం చేస్తుంది.
6. పాలు మరియు తేనె: పాలు మరియు తేనె మిక్స్ చేసి పాదాలకు అప్లై చేయడాలి. డ్రైగా మారిన తర్వాత రెండవసారి కోట్ వేయాలి. ఇది ఎక్స్ ఫ్లోయేట్ గా పనిచేస్తుంది. మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. ఈ కాంబినేషన్ స్కిన్ టాన్ నివారించి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది.
7. వేప ప్యాక్: వేప ఆకులను మెత్తగా పేస్ట్ చేసి పసుపు అప్లై చేయాలి. వేపలో యాంటీ ఫంగల్ లక్షణాలు బ్యాక్టీరియాను నివారిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ తగ్గి పగుళ్ళు ఏర్పడకుండా ఎదుర్కొంటుంది. ఈపేస్ట్ కు కొద్దిగా పసుపు చేర్చితే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇన్ప్లమేషన్ తగ్గిస్తుంది.
8. రైస్ ఫ్లోర్ మరియు హనీ: రైస్ ఫ్లోర్ హనీ స్ర్కబ్ చాలా సులభం మరియు త్వరగా రిజల్ట్ అందిస్తుంది. తేనె ఎక్సఫ్లోయేట్ గా పనిచేస్తుంది మరియు మాయిశ్చరైజింగ్ గా పనిచేస్తుంది. . రైస్ ఫ్లోర్ పాదాల మీద ఉండే డెడ్ స్కిన్ తొలగిస్తుంది.
9. మస్టర్డ్ ఆయిల్: ఆముదం నూనెతో మసాజ్ చేయాలి. ఆముదంను పాదాలకు అప్లై చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయం వేడి నీటిలో 10 నిముషాలు నాన్చి తర్వాత స్టోన్ తో రుద్దితే డెడ్ స్కిన్ సెల్స్ తొలగి పోయి, పాదాలు సాప్ట్ గా కనబడుతాయి.
10. వెనిగర్ : వేడి నీటిలో వెనిగర్ మిక్స్ చేసి అందులో పాదాలను డిప్ చేసి ఫ్యూమిస్ స్టోన్ తో రుద్దడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి . తర్వాత స్ట్రాంగ్ మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
No comments